సగం షూటింగ్ అయ్యాక నన్ను తీసేశారు.. ఆ అవమానంతో చాలా బాధపడ్డానన్న హీరో

సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోలు దూసుకుపోతున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేసి ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ యంగ్ హీరో వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు కుర్ర హీరో.. తాజాగా తనకు జరిగిన ఓ చేదు అనుభవాన్ని పంచుకున్నాడు.

సగం షూటింగ్ అయ్యాక నన్ను తీసేశారు.. ఆ అవమానంతో చాలా బాధపడ్డానన్న హీరో
Hero

Updated on: Apr 08, 2026 | 5:02 PM

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో ఆయన ఒకరు. విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఆ యంగ్ హీరో.. ఆయన చేసిన సినిమాలని మంచి విజయాలను అందుకున్నాయి. అలాగే తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఏ హీరో టచ్ చేయని కథలను ఎంచుకుంటూ తన స్టైల్ లో సినిమాలు తెరకెక్కించి హిట్స్ మీద హిట్స్ అందుకుంటున్నాడు.. అయితే తన  నటన నచ్చక ఓ దర్శకుడు తనను రిజెక్ట్ చేశాడని చెప్పాడు. సగం షూటింగ్ పూర్తయిన తర్వాత తనను సినిమా నుంచి తీసేశారని తెలిపాడు. ఇంతకూ ఆ హీరో ఎవరో కాదు యంగ్ అండ్ డైనమిక్ హీరో అడవి శేష్. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ఈ కుర్ర హీరో..

నాకు బ్రేకప్ అయ్యింది.. మా అమ్మకు కూడా అది తెలుసు.. షాకింగ్ విషయం చెప్పిన కృతిశెట్టి

అడవి శేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ డెకాయిట్. ఈ సినిమాలో అడవి శేష్‌కు జోడీగా క్రేజీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. షానీల్ డియో ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ & సోనీ పిక్చర్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్ 10న డెకాయిట్ సినిమా గ్రాండ్ గా విడుదలకానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు శేష్.

ఇవి కూడా చదవండి

వార్ని..! ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్ నటి కదా గురూ..!!

చందమామ సినిమాలో ముందుగా శేష్ ను తీసుకున్నారట. నవదీప్ చేసిన పాత్రలో ముందుగా శేష్ నటించాల్సి ఉందట. అప్పట్లో ఈ సినిమాకు మల్లెపువ్వు అని టైటిల్ ను అనుకున్నారట. అంతే కాదు షూటింగ్ కూడా కొంతమేర జరిగిందట. శేష్ కూడా షూటింగ్ లో పాల్గొన్నాడట.. అయితే తన నటన పై దర్శకుడు కృష్ణవంశీ అసంతృప్తి వ్యక్తం చేశారట. అంతే కాదు సగం షూటింగ్ అయిపోయిన తర్వాత శేష్ ప్లేస్ లోకి నవదీప్ ను తీసుకున్నారట. అది తనను ఎంతో బాధపెట్టిందని తెలిపాడు శేష్. ఆ అవమానం తర్వాత తాను తాను నిరూపించుకోవడానికి కసితో పని చేశా అని తెలిపాడు శేష్.

హీరో లేడు.. ఫైట్స్, స్పెషల్ సాంగ్స్ లేవు..! కట్ చేస్తే నాలుగేళ్లుగా ఓటీటీలో తిరుగులేని సినిమా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us