Tollywood: శ్రీదేవితో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ చిన్నారి సౌత్‏లో స్టార్ హీరోయిన్.. ఈ అందాల వెన్నెలమ్మను గుర్తుపట్టండి..

|

Nov 28, 2022 | 9:08 PM

మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ, కమల్ హాసన్ వంటి స్టార్లతో కలిసి ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‎లోనూ రాణిస్తోంది.

Tollywood: శ్రీదేవితో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ చిన్నారి సౌత్‏లో స్టార్ హీరోయిన్.. ఈ అందాల వెన్నెలమ్మను గుర్తుపట్టండి..
Actress
Follow us on

బాల్యం ఓ మధురమైన జ్ఞాపకం. చిన్ననాటి రోజులకు సంబంధించిన ఫోటోలను ఎంతో అపురూపంగా దాచుకుంటారు. ముఖ్యంగా పసిపిల్లలుగా ఉన్నప్పటి ఫోటోస్ ఇప్పుడు చాలా మంది వద్ద ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతుంది. కానీ ఆ చిన్నారి మాత్రం చిన్నతనం నుంచే వెండితెరపై సందడి చేస్తుంది. అందమైన రూపంతో.. పెద్ద పెద్ద కళ్లతో చిన్నతనంలోనే ఎన్నో హావాభావాలను పలికిస్తూ.. ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత హీరోయిన్ గా బిగ్ స్క్రీన్ పై మెప్పించింది. హీరోయిన్ శ్రీదేవి సినిమాలో బాలనటిగా కనిపించింది. ఎవరో గుర్తుపట్టండి. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ, కమల్ హాసన్ వంటి స్టార్లతో కలిసి ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‎లోనూ రాణిస్తోంది. పైన ఫోటోలో ఉన్న ఈ అందాల వెన్నెలమ్మను గుర్తుపట్టండి.

ఆ చిన్నారి మరెవరో కాదు.. సీనియర్ హీరోయిన్ మీనా. దక్షిణాది సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం లేని పేరు. బాలనటిగా తెలుగు, తమిళ్ చిత్రాల్లో పలు చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలో దాదాపు అందరూ అగ్రకథానాయకులతో నటించింది. తెలుగు, తమిళ చిత్రరంగాలలో 1991 నుండి 2000 వరకూ, సుమారు ఒక దశాబ్దం పాటు అగ్రతారగా నిలచింది. తెలుగులో వెంకటేష్, మీనా జంటగా సుందర కాండ, చంటి, సూర్య వంశం, అబ్బాయిగారు వంటి విజయవంతమైన సినిమాలు వచ్చాయి. బాలకృష్ణతో.. ముద్దుల మొగుడు, బొబ్బిలి సింహం.. మెగాస్టార్ చిరంజీవితో.. ముఠా మేస్త్రి, స్నేహం కోసం, శ్రీ మంజునాథ వంటి చిత్రాల్లో నటించింది.

ఇవి కూడా చదవండి

2009లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విద్యాసాగర్‌తో మీనా వివాహం జరిగింది. ఈ దంపతులకు నైనికా అనే కుమార్తె ఉంది. ఇక తెలుగులో పోలీస్ సినిమాతో మీనా కూతురు బాలనటిగా కనిపించింది. ఈ ఏడాది జూన్ 28న రాత్రి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో కొవిడ్ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ మీనా భర్త తుదిశ్వాస విడిచారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.