Tollywood : ఈ క్యూటీని గుర్తుపట్టారా.? ఆమెను చూస్తేనే ప్రేమలోపడిపోవాలనిపిస్తుంది

ప్రతి రోజూ సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ నడుస్తుంటుంది. కొత్త సినిమా నుంచి విడుదలయ్యే సాంగ్స్.. పోస్టర్స్ నెట్టింట క్షణాల్లో వైరలవుతుంటాయి. అలాగే సినిమా సెలబ్రెటీల ప్రొఫిషనల్ విశేషాలనుంచి పర్సనల్ విషయాల వరకు సోషల్ మీడియాలో దర్శనమిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే పలువురు స్టార్స్ చిన్ననాటి ఫోటోస్ కూడా అదే స్థాయిలో వైరలవుతున్నాయి.

Tollywood : ఈ క్యూటీని గుర్తుపట్టారా.? ఆమెను చూస్తేనే ప్రేమలోపడిపోవాలనిపిస్తుంది
Tollywood Actress
Follow us

|

Updated on: Aug 12, 2024 | 1:13 PM

సోషల్ మీడియా అనేది మన డైలీ లైఫ్ లో ఓ పార్ట్ అయిపొయింది. ఇన్ స్టా గ్రామ్ లో వీడియోలను, రీల్స్ చూడకుండా జనాలు ఉండలేకపోతున్నారు. ప్రతి రోజూ సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ నడుస్తుంటుంది. కొత్త సినిమా నుంచి విడుదలయ్యే సాంగ్స్.. పోస్టర్స్ నెట్టింట క్షణాల్లో వైరలవుతుంటాయి. అలాగే సినిమా సెలబ్రెటీల ప్రొఫిషనల్ విశేషాలనుంచి పర్సనల్ విషయాల వరకు సోషల్ మీడియాలో దర్శనమిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే పలువురు స్టార్స్ చిన్ననాటి ఫోటోస్ కూడా అదే స్థాయిలో వైరలవుతున్నాయి. ఒకప్పటి హీరోయిన్స్ దగ్గర నుంచి లేటెస్ట్ బ్యూటీస్ వరకు తమ అభిమాన హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అవి కాస్త ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. ఆ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టండి. చూస్తేనే ప్రేమలో పడిపోవాలనిపిస్తుంది. ఆమె అంత అండగా ఉంటుంది మరి.

ఆ చిన్నారి మరెవరో కాదు.. క్రేజీ హీరోయిన్ మేఘా ఆకాష్. 1995 అక్టోబర్ 26న చెన్నైలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ. అక్కడే మహిళా క్రిస్టియన్ కాలేజీ అయిన లేడీ ఆండల్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. చదువు తర్వాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళ్ లో ఒరు పక్క కథై చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2017లో తెలుగులో నితిన్ హీరోగా.. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన లై చిత్రంతో ఇక్కడి ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో మేఘాకు అనుకున్నన్ని అవకాశాలు మాత్రం రాలేదు.

ఆ తర్వాత తెలుగులో మరోసారి నితిన్ కు జోడీగా చల్ మోహన్ రంగ చేసింది. కానీ ఈ సినిమా కూడా నిరాశపరిచింది.అలాగే శ్రీవిష్ణు రాజ రాజ చోర చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది మేఘా.. ఇక  రావణాసుర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించారు. ఈ సినిమాలో మేఘ తన నటనతో ఆకట్టుకున్నప్పటికీ సినిమా మాత్రం హిట్ అవ్వలేదు. దాంతో ఈ చిన్నదానికి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ క్యూటీ.

మేఘ ఆకాష్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Megha Akash (@meghaakash)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..