Tollywood: చిరు ఒడిలో ఉన్న ఈ చిన్నోడిని గుర్తుపట్టండి.. మనందరికి తెలిసిన హీరోనే.. అల్లరి ఎక్కువే..

|

Jan 27, 2023 | 8:36 PM

అంతేకాదు.. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించడమే కాకుండా.. మాస్ యాక్షన్ చిత్రాలతోనూ ఆకట్టుకున్నాడు. ఈ చిన్నోడు మెగా ప్యామిలీ హీరోనే. గుర్తుపట్టండి.

Tollywood: చిరు ఒడిలో ఉన్న ఈ చిన్నోడిని గుర్తుపట్టండి.. మనందరికి తెలిసిన హీరోనే.. అల్లరి ఎక్కువే..
Actor
Follow us on

కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. చిన్నప్పటి ఫోటోస్ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇటీవల స్టార్ హీరోహీరోయిన్స్ బాల్యం తాలూకు జ్ఞాపకాలు ఇంటర్నెట్‏ను షేక్ చేస్తున్నాయి. కదా.. తాజాగా మరో హీరో చిన్నప్పటి పిక్ కూడా హల్చల్ చేస్తుంది. పైన ఫోటోను చూశారు కదా. ఎవరో గుర్తుపట్టండి. తక్కువ సమయంలోనే నటన పరంగా ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాదు.. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించడమే కాకుండా.. మాస్ యాక్షన్ చిత్రాలతోనూ ఆకట్టుకున్నాడు. ఈ చిన్నోడు మెగా ప్యామిలీ హీరోనే. గుర్తుపట్టండి.

చిరు ఒడిలో ఉన్న ఆ చిన్నోడు మరెవరో కాదు.. టాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. మెగాస్టార్ మేనల్లుడిగా తెలుగు తెరపై హీరోగా అరంగేట్రం చేశాడు. రేయ్ సినిమాతో హీరోగా అడుగుపెట్టి పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. సాయి ధరమ్ తేజ్ చిరు చెల్లెలు దుర్గ కుమారుడు. సాయి తమ్ముడు కూడా హీరో అన్న సంగతి తెలిసిందే. అతనే పంజా వైష్ణవ్ తేజ్.

ఇవి కూడా చదవండి

సుప్రీమ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, ప్రతి రోజు పండగే వంటి చిత్రాలతో హిట్స్ అందుకున్నాడు సాయి. ఇక ఇటీవలే రిపబ్లిక్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చినా అంతగా ఆకట్టుకోలేకపోయాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.