Tollywood: ఈ బుడ్డోడు ఇప్పుడు మస్త్ ట్యాలెంటెడ్ హీరో.. హ్యాట్రిక్ హిట్స్ కొట్టేశాడు.. గుర్తు పడితే తోపే

|

Jun 20, 2024 | 8:37 AM

ఈ బుడ్డోడు ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో. అలాగనీ స్టార్ హీరో రేంజ్ కాదు. జస్ట్ మీడియం రేంజ్ హీరో.. కాన ఇదే జోరు కొనసాగిస్తే అతని ట్యాలెంట్ కు భవిష్యత్ లో తప్పకుండా స్టార్ యాక్టర్ అవుతాడు. ఇతని సినిమాల్లో కథే ప్రధానం.. అందులోనూ వైవిధ్యానికి పెద్ద పీట వేస్తాడు. ఇక నటన అంటారా? అందులో ఎప్పుడో డిస్టింక్షన్ లో పాసయ్యాడు.

Tollywood: ఈ బుడ్డోడు ఇప్పుడు మస్త్ ట్యాలెంటెడ్ హీరో.. హ్యాట్రిక్ హిట్స్ కొట్టేశాడు.. గుర్తు పడితే తోపే
Tollywood Hero
Follow us on

పై ఫొటోలో స్టైల్ గా నిల్చొని పోజులిస్తోన్న బుడ్డొడిని గుర్తు పట్టారా? పోలికలు చూసి గుర్తు పట్టే అవకాశం చాలా తక్కువ. అందుకే మీకు కొన్ని క్లూస్ ఇస్తున్నాం. ఈ బుడ్డోడు ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో. అలాగనీ స్టార్ హీరో రేంజ్ కాదు. జస్ట్ మీడియం రేంజ్ హీరో.. కాన ఇదే జోరు కొనసాగిస్తే అతని ట్యాలెంట్ కు భవిష్యత్ లో తప్పకుండా స్టార్ యాక్టర్ అవుతాడు. ఇతని సినిమాల్లో కథే ప్రధానం.. అందులోనూ వైవిధ్యానికి పెద్ద పీట వేస్తాడు. ఇక నటన అంటారా? అందులో ఎప్పుడో డిస్టింక్షన్ లో పాసయ్యాడు. లవ్, కామెడీ, విలనిజం.. ఇలా ఏ పాత్రలకైనా తన కష్టంతో ప్రాణం పోస్తాడు. ముఖ్యంగా టాలీవుడ్ లో మీడియం రేంజ్ సినిమాలు తీసేవారికి ఈ హీరోనే ఫస్ట్ చాయిస్. ఇలాంటి సినిమాలతోనే హ్యాట్రిక్ హిట్స్ కూడా కొట్టాడీ ట్యాలెంటెడ్ హీరో.మరి ఇప్పుడైన చెప్పగలరా? ఈ హీరో ఎవరా? అని. కష్టంగా ఉందా? అయితే సమాధానం మేమే చెబుదాం లెండి. ఈ బుడ్డోడు మరెవరో కాదు కలర్ ఫొటోతో హీరోగా పరిచయమై ఇటీవలే ప్రసన్నవదనంతో సూపర్ హిట్ అందుకున్న సుహాస్. ఇది అతని చిన్నప్పటి ఫొటో.

సుహాస్‌ షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత 2018లో విడుదలైన పడి పడి లేచే మనసు సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. మజిలీ, డియర్ కామ్రేడ్, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, ప్రతిరోజు పండగే, ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య తదితర సినిమాల్లో హీరోకి ఫ్రెండ్ గా నటించాడు. ఆ తర్వాత కలర్ ఫొటోతో ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో అమాయకపు కుర్రాడిగా అతని అభినయం అందరి ప్రశంసలు అందుకుంది ఈ సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఫ్యామిలీ డ్రామా, హిట్ 2 సినిమాల్లో సైకో కిల్లర్ గా నటించి మెప్పించాడు. రైటర్ పద్మ భూషణ్, అంబాజీ పేట మ్యారేజీ బ్యాండ్, శ్రీరంగ నీతులు, ప్రసన్నవదనం సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు. ప్రస్తుతం సుహాస్ చేతిలో ఆనంద్ రావ్ అడ్వెంచెర్స్, కేబుల్ రెడ్డి వంటి క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

విజయ్ సేతుపతితో హీరో సుహాస్..

హీరో సుహాస్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.