Tollywood: మేడమ్ ఇది మీరేనా? ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఒక్క సినిమాతోనే సెన్సేషన్ అయిపోయిందిగా

గత కొన్ని రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ అమ్మాయి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే ఆమె ఫొటోలు, వీడియోలే దర్శనమిస్తున్నాయి. అలాగనీ ఈమె స్టార్ హీరోయిన్ కాదు. ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్క సినిమా చేసిందంతే.. అది కూడా..

Tollywood: మేడమ్ ఇది మీరేనా? ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఒక్క సినిమాతోనే సెన్సేషన్ అయిపోయిందిగా
Tollywood Director

Updated on: Apr 09, 2026 | 7:48 PM

పై ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆమె పేరు తెగ వినిపిస్తోంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఆమె ఫొటోలు, వీడియోలే కనిపిస్తున్నాయి. అలాగనీ ఈమె స్టార్ హీరోయిన్ కాదు.. నటి కూడా కాదు. కానీ ట్యాలెంట్ లో అంతకు మించి అని చెప్పవచ్చు. గతంలో పలు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లు చేసిందీ ముద్దుగుమ్మ. ఇవి యూట్యూబ్ లు, ఓటీటీలో బాగా ఆడాయి. కానీ ఎందుకో గానీ ఈ బ్యూటీ పేరు పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. అయితే లేటెస్ట్ గా ఆమె చేసిన ఒక సినిమా థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. దెబ్బకు ఆమె పేరు తెగ మార్మోగిపోతోంది. మరి ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారు? మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేడీ డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు. విజయ నిర్మల, జీవితా రాజశేఖర్, సుధా కొంగర, బి.జయ, బీ.వీ.నందిని రెడ్డి మగవారితో సమానంగా మెగా ఫోన్ పట్టుకుని సినిమాలు తీశారు. ఇప్పుడీ జాబితాలోకి మరో అమ్మాయి చేరింది. ఆమెనే మానస శర్మ. అదేనండి రాకాస సినిమా డైరెక్టర్. పై ఫొటోలో ఉన్నది ఆమెనే. అది సుమారు 4-5 ఏళ్ల క్రితం నాటి ఫొటో. తన వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఓ ఈవెంట్ లో ఇలా కనిపించింది. ఇప్పుడు రాకాస సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఈ లైడీ డైరెక్టర్ త్రో బ్యాక్ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి.

మానస శర్మ బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. ఈ లేడీ డైరెక్టర్ ది ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా. ఆమె ప్రయాణం యూట్యూబ్ నుంచి మొదలైంది. 2019లో నిహారిక కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలో ‘మ్యాడ్ హౌస్’ అనే యూట్యూబ్ వెబ్ సిరీస్‌కు రైటర్‌గా పనిచేసింది మానస. ఆ తర్వాత సంగీత్ శోభన్ హీరోగా తెరకెక్కిన ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వెబ్ సిరీస్ కు క్రియేటర్‌గా, రచయితగా వర్క్ చేసింది .ఈ సిరీస్ సూపర్ హిట్ గా నిలిచింది. ఓటీటీలో రికార్డు వ్యూస్ తెచ్చుకుంది. దీని తర్వాత డైరెక్టుగా మెగా ఫోన్ పట్టుకుని ‘బెంచ్ లైఫ్’ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించింది మానస. సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్ సిరీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇలా షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లతో ఇప్పటికే తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మానస ఇప్పుడు రాకాస సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై కూడా సక్సెస్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

రాకాస సినిమా థియేటర్ లో మానస శర్మ..

సంగీత్ శోభన్, నయన్ సారిక హీరో, హీరోయిన్లుగా నటించిన రాకాస సినిమా ఏప్రిల్ 03న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. మెగా డాటర్ నిహారిక కొణిదెల ఈ సినిమాను నిర్మించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us