ఈ మధ్యకాలంలో సక్సెస్ కొట్టిన దర్శకులు తమ ఇష్టదైవాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ముఖ్యంగా చాలామంది డైరెక్టర్లు తాము అనుకున్నది నెరవేరితే తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారు. అక్కడ తలనీలాలు సమర్పించి మొక్కలు తీర్చుకుంటున్నారు. గతంలో యానిమల్ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన తర్వాత సందీప్ రెడ్డి వంగా ( తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించాడు. అలాగే కల్కి 2898 ఏడీ సూపర్ హిట్‌గా నిలువడంతో నాగ్ అశ్విన్ కూడా తలనీలాలు ఇచ్చాడు. ఇప్పుడు ఈ జాబితాలో మరో టాలీవుడ్ డైరెక్టర్ చేరాడు. పై ఫొటోలో ఉన్నది అతనే. మరి గుండుతో కనిపిస్తోన్న ఈ టాలీవుడ్ డైరెక్టర్ ను గుర్తు పట్టారా? అలాగనీ అతను ఎక్కువగా సినిమాలేమీ చేయలేదు. ముచ్చటగా మూడు సినిమాలు తీశాడు అంతే. మొత్తం 5 సినిమాలు మాత్రమే తీశాడు. అంతకు ముందు కొన్ని సినిమాలకు రచయితగా పనిచేశాడు. అలాగే మరికొన్ని సినిమాల్లో నటించాడు కూడా. అయితే అతని గత రెండు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. దీంతో ఈ డైరెక్టర్ పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. అతను మరెవరో కాదు లక్కీ భాస్కర్ సినిమాతో క్రేజీ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయిన వెంకీ అట్లూరి. సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో తిరుమల వెళ్లిన అతను శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నాడు. దీంతో ప్రస్తుతం అతని ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
లైఫ్‌లో చాలా విషయాలు ఇవ్వలేని కిక్‌ని డబ్బు ఇస్తుందంటూ లక్కీ భాస్కర్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు వెంకీ అట్లూరి. మిడిల్ క్లాస్ పీపుల్స్ అందరికీ కనెక్ట్ అయ్యే సబ్జెక్టుని చాలా కూల్‌గా తెరకెక్కించి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇందులో మలయాళ స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి హీరో, హీరోయిన్లుగా నటించాడు. దీపావళి కానుకాగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. . సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.
It’s a hit combo #LuckyBaskhar @dulQuer @SitharaEnts #venkyatluri @Meenakshiioffl pic.twitter.com/GgnHDDwUv0
— G.V.Prakash Kumar (@gvprakash) November 3, 2024
Invest in #VenkyAtluri stocks, it’s rising with each movie 📈 Back to back 100 cr grossers with non Telugu heroes that too with content oriented scripts is no small feat 💥💥💥 pic.twitter.com/djbQHsjB36
— V M R (@vasireddy1905) November 3, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.