
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులోనూ ఈ హీరోకు మంచి మార్కెట్ ఉంది. అంతేకాదు అభిమానులు కూడా భారీగానే ఉన్నారు. అందుకే ధనుష్ నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ రిలీజవుతోంది. అలా సుమారు ఆరేళ్ల క్రితం ధనుష్ నటించిన సినిమా తంగా మగన్. తెలుగులో నవ మన్మథుడుగా రిలీజైంది. ఆర్ వేల్ రాజ్ తెరకెక్కించిన ఈ సినిమాలో ధనుష్ సరసన సమంత, అమీజాక్సన్ హీరోయిన్లుగా నటించారు. అలాగే కేఎస్ రవికుమార్, రాధికా శరత్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 2015లో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కాగా ఇదే నవ మన్మథుడు సినిమాలో హీరో ధనుష్ ఫ్రెండ్ అయిన అరవింద్ పాత్రలో ఒక యంగ్ హీరో నటించాడు. అప్పటికింకా అతను పెద్దగా సినిమాలు చేయలేదు. కాబట్టి ఎవరూ ఆ హీరోను గుర్తించలేకపోయారు. అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఎప్పుడైతే ప్రారంభమైందో ఈ హీరో పేరు తెగ మార్మోగుతుంది. ఎక్కడ చూసినా ఇతని పేరే వినిపిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే ఈ హీరోకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, ఆసక్తికర విషయాలే దర్శనమిస్తున్నాయి.
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఈ నటుడు కూడా ఒకడు. తన ఆట, మాట తీరుతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. అఫ్ కోర్స్ నెగెటివిటీ కూడా ఉన్నా ప్రస్తుతం హౌస్ లో ఉన్న అందరికంటే ఈ హీరోనే స్ట్రాంగెస్ట్ కంటెస్ట్ అని చెప్పవచ్చు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు త్రిగుణ్.
2009 లో కథ అనే తెలుగు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అదితీ అరుణ్ అలియాస్ త్రిగుణ్. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయినా హీరోగా వరుస సినిమాలు చేశాడు. తెలుగు, తమిళ్ లో హీరోగా, సెకెండ్ హీరోగా దాదాపు 30 సినిమాలు చేసాడు. కథ, తుంగభద్ర, గరుడవేగా, 24 కిసెస్, చీకటి గదిలో చితక్కొట్టుడు, డియర్ మేఘ, లైన్ మ్యాన్, ఈషా తదతర సినిమాల్లో నటించాడు త్రిగుణ్. అలాగే పలు వెబ్ సిరీసుల్లోనూ నటించాడు. ఇదే క్రేజ్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోకి కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.