Tollywood: ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. మహేశ్, ప్రభాస్‌లతో సినిమాలు చేసింది.. ఎవరో గుర్తు పట్టారా?

|

Jul 27, 2024 | 8:13 PM

పై ఫొటోలో క్యూట్‌ గా కనిపిస్తున్న ఈ పాప ఎవరో కనిపెట్టారా? ఇప్పుడు ఈమె సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. ముఖ్యంగా కుర్రాళ్లందరికి ఈ బ్యూటీ అంటే క్రష్. తెలుగులో మహేశ్ బాబు, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది

Tollywood: ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. మహేశ్, ప్రభాస్‌లతో సినిమాలు చేసింది.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actress Childhood photo
Follow us on

పై ఫొటోలో క్యూట్‌ గా కనిపిస్తున్న ఈ పాప ఎవరో కనిపెట్టారా? ఇప్పుడు ఈమె సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. ముఖ్యంగా కుర్రాళ్లందరికి ఈ బ్యూటీ అంటే క్రష్. తెలుగులో మహేశ్ బాబు, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ముఖ్యంగా గతేడాది ఒక పాన్ ఇండియా సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకుందీ బ్యూటీ. సీతమ్మగా తెలుగు వారి ఆదరాభిమానాలు గెల్చుకుంది. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్ ఈ క్యూటీ మరెవరో కాదు ఆది పురుష్ ఫేమ్ కృతిసనన్. శనివారం (జులై 27) ఆమె పుట్టిన రోజు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ ముద్దుగుమ్మకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ క్రమంలోనే కృతికి సంబంధించిన చిన్ననాటి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

2014లో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిచిన ‘వన్ ..నేనొక్కడినే’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది కృతి సనన్. మొదటి సినిమాతోనే కుర్ర కారు మనసులు కొల్లగొట్టింది. ఆ తర్వాత అక్కినేని నాగచైతన్య సరసన ‘దోచేయ్’ సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు కృతికి మంచి పేరు తెచ్చినా కమర్షియల్ గా విజయం సాధించలేకపోయాయి. దీంతో ఈ అమ్మడు బాలీవుడ్ కు మకాం మార్చింది. అక్కడ కూడా మొదట నిరాశే ఎదురైంది. అయితే మెల్లగా మంచి హిట్ లు వచ్చి పడ్డాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో కృతి ఒకరు. అలాగే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో కూడా కృతి టాప్ లో ఉంది.

ఇవి కూడా చదవండి

గతేడాది ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమాతో మరోసారి తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది కృతి. ఇందులో జానకిగా ఆమె అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. కానీ సినిమా బోల్తా పడడంతో మళ్లీ తెలుగు నాట నిరాశే ఎదురైంది.

 

అయితే బాలీవుడ్ లో మాత్రం ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంటోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.