సోషల్ మీడియాలో సినీతారల త్రోబ్యాక్ ఫోటోస్ తెగ వైరలవుతుంటాయి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం బాషల్లోని స్టార్ హీరోహీరోయిన్లకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్, ఫ్యామిలీ పిక్స్ షేర్ చేస్తుంటారు ఫ్యాన్స్. ఇటీవల కొన్ని నెలలుగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్ ఫోటోస్ చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే ఫేమస్ హీరో సతీమణి.. ఒకప్పటి హీరోయిన్ టీనేజ్ పిక్ నెట్టింట హల్చల్ చేస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా ?. పైన ఫోటోను చూశారు కదా.. అందులో రెడ్ డ్రెస్‌గా క్యూట్ గా అందగా కనిపిస్తున్న ఆ అమ్మాయి తెలుగు స్టార్ హీరో భార్య. ఫస్ట్ మూవీతోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఆమె.. పెళ్లి తర్వాత మాత్రం సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇప్పటికీ తన పూర్తి సమయాన్ని ఫ్యామిలీకే కేటాయిస్తుంది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టగలరా ?.. తను మరెవరో కాదండి.. సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్. చెల్లెలు శిల్ప శిరోద్కర్ ఈ ఫోటోను తన ఇన్ స్టాలో షేర్ చేశారు.
నమ్రత శిరోద్కర్.. 1972 జనవరి 2న ముంబాయిలో జన్మించారు. కథానాయికగా సినీరంగ ప్రవేశం చేయకముందు మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 1993లో మిస్ ఇండియాగా ఎంపికైంది. ఆ తర్వాత హిందీలో జబ ప్యార్ కిసీ సే హోతా హై సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. హిందీలో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది నమ్రత. ఇక తెలుగులో 2000లో వంశీ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఇందులో మహేష్ బాబు హీరోగా నటించారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. వీరి వివాహం 2005 ఫిబ్రవరిలో జరిగింది. వీరికి బాబు గౌతమ్ ఘట్టమనేని, పాప సితార జన్మించారు.
పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది నమ్రత. ప్రస్తుతం ఇంటి బాధ్యతలు.. ఘట్టమనేని ప్రొడక్షన్ సంస్థను దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇటీవలే నమ్రత పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇటీవలే గుంటూరు కారం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు మహేష్. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీకి అన్ని వర్గాల అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో శ్రీలీల,మీనాక్షి హీరోయిన్లుగా నటించారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.