Actress Kushboo: 98 నుంచి 58 కిలోలకు.. తన వెయిట్ లాస్ సీక్రెట్ చెప్పిన ఖుష్బూ.. ఇలా కూడా బరువు తగ్గొచ్చా?

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది ఖుష్బూ. తన అందం, అభినయంతో దక్షిణాదిలో స్టార్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే పెళ్లి, పిల్లల తర్వాత సహజంగానే ఆమె శరీరాకృతి మారింది. బాగా బరువు పెరిగారు. అయితే ఇప్పుడు మళ్లీ సన్నజాజి తీగలా మారిపోయిందీ అందాల తార.

Actress Kushboo: 98 నుంచి 58 కిలోలకు.. తన వెయిట్ లాస్ సీక్రెట్ చెప్పిన  ఖుష్బూ.. ఇలా కూడా బరువు తగ్గొచ్చా?
Actress Kushboo

Updated on: Sep 28, 2026 | 8:41 PM

ప్రముఖ నటి ఖుష్బూ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తెలుగుతో పాటు దక్షిణాది భాషలన్నింటిలోనూ సినిమాలు చేసిందీ అందాల తార. తన అందం, అభినయంతో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అయితే సినిమా కెరీర్ ఫుల్ స్పీడ్ గా ఉంటున్న సమయంలోనే పెళ్లి చేసుకుందీ అందాల తార. ఆ తర్వాత ఇద్దరు పిల్లలకు తల్లైంది. దీంతో సహజంగానే ఆమె శరీరాకృతి మారిపోయింది. భారీగా బరువు పెరిగిపోయింది. దీనికి తోడు రాజకీయాల్లోనూ బిజీ కావడంతో ఫిట్ నెస్ పై శ్రద్ద పెట్టలేకపోయింది. దీంతో ఒకానొక దశలో ఏకంగా 98 కిలోల బరువుకు చేరుకుంది ఖుష్బూ. అయితే ఇప్పుడు మళ్లీ స్లిమ్ గా మారిపోయింది ఖుష్బూ. మొన్నటివరకు బొద్దుగుమ్మగా ఉన్న ఆమె ఇప్పుడు సన్నజాజి తీగలా స్లిమ్ గా మారిపోయింది. గత నాలుగేళ్లలో ఖుష్బూ సుమారు 40 కిలోల బరువు తగ్గారట. ఈ నేపథ్యంలో ఒక మీడియా పాడ్ కాస్ట్ లో తన వెయిట్ లాస్ జర్నీ గురించి చెప్పుకొచ్చారు ఖుష్బూ. ‘ మొన్నటివరకు నా బరువు 98 కేజీలు ఉండేద. నా పాత సినిమాలను చూసుకుంటే నన్ను నేనే గుర్తుపట్టలేకపోయేదాన్ని. నా భర్త ఇప్పటికీ యోగా, వాకింగ్ చేస్తారు. కానీ బిజీ లైఫ్ కారణంగా నేను వీటిపై దృష్టి పెట్టలేదు. ఇదే క్రమంలో మెట్లు ఎక్కేటప్పుడు నాకు మోకాళ్ల నొప్పి రావడం మొదలైంది. నా పిల్లలు కూడా వారి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం, బరువు తగ్గడం ప్రారంభించారు. అందుకే నేను కూడా వారిలా ప్రయత్నించాను’,

‘ బరువు తగ్గే నా ఐదేళ్ల ప్రయాణంలో, నేను దేన్నీ పూర్తిగా వదులుకోలేదు. నాకు ఇష్టమైనవాటన్నిటినీ తిన్నాను. ఇష్టమైన బిర్యానీ, ఐస్ క్రీమ్, స్వీట్లు, చక్కెర టీ వంటి ఫుడ్ ఐటమ్స్ ను కూడా తీసుకున్నాను. అయితే నా శరీరానికి అవసరమైనంత మాత్రమే తీసుకున్నాను. కేవలం ఇష్టం అని బిర్యానీని ఎక్కువగా తీసుకోలేదు. ఒక చిన్న గిన్నెడు అన్నం, ఒక్క ముద్ద, అంతే. నేను ఐస్ క్రీమ్ కూడా తిన్నాను. చక్కెర కలిపిన టీ తాగుతాను. కానీ నేను ప్రతీదీ మితంగానే తీసుకున్నాను. నేను తినే పరిమాణంపైనే చాలా దృష్టి పెడతాను. నా శరీరానికి అవసరమైనంత మాత్రమే తింటాను’

ఇవి కూడా చదవండి

కేవలం డైటింగ్ మాత్రమే కాకుండా, ఖుష్బూ ప్రతిరోజూ తప్పకుండా వ్యాయామం కూడా చేస్తుంది. ‘నేను జిమ్‌కు వెళ్ళే స్థోమత లేదు. అందుకే ఇంట్లోనే యోగా, మరికొన్ని వ్యాయామాలు చేస్తాను. అది కాకుండా, నేను తప్పకుండా వాకింగ్ చేస్తాను. ఏది వదిలిపెట్టినా వాకింగ్ ను మాత్రం వదిలిపెట్టను’ అని తన వెయిట్ లాస్ జర్నీ గురించి చెప్పుకొచ్చింది ఖష్బూ. మొన్నటివరకు 98 కేజీల బరువున్న ఈ అందాల తార తన లైఫ్ స్టైల్ లో సాధారణ మార్పుల ద్వారా ఏకంగా 40 కేజీలు తగ్గింది.
” అని తన వెయిల్ లాస్ జర్నీ గురించి చెప్పుకొచ్చారు ఖుష్బూ.

ఇద్దరు కూతుళ్లతో ఖుష్బూ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us