Love Oh Love: నాగదుర్గ హీరోయిన్‌గా తమిళ సినిమా.. ట్రైలర్ అదిరిపోయింది భయ్యా.. అబ్బాయిల కోసమే..
నాగదుర్గ.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు. మొన్నటివరకు తెలంగాణ ఫోక్ డ్యాన్సర్. కానీ ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్. ఇడుపు కాయితం అనే సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయం కాబోతుంది. కానీ అంతకు ముందే తమిళంలో లవ్ ఓ లవ్ అనే చిత్రంలో నటిస్తుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

తెలంగాణ ప్రాంతానికి చెందిన నాగదుర్గ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఫోక్ సాంగ్స్ ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియా, యూట్యూబ్ ప్రైవేట్ సాంగ్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన డ్యాన్స్, నటనతో కుర్రకారును ఆకట్టుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు వెండితెరపై హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యింది. ప్రియదర్శి హీరోగా తెరకెక్కుతున్న ఇడుపు కాయితం అనే సినిమాలో కథానాయికగా నటిస్తుంది. ఇటీవల విడుదలైన టైటిల్ పోస్టర్ క్షణాల్లో వైరల్ అయ్యింది. అయితే తెలుగు కంటే ముందే నాగదుర్గ కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంది. నాగదుర్గ మొదటిసారి తమిళంలో హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘లవ్ ఓ లవ్’ (Love Oh Love). ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా అలరించడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఎక్కువ మంది చదివినవి : Sunil: ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే.. నా గుండెను తాకింది.. సునీల్ కామెంట్స్..
సాధారణంగా అబ్బాయిలు ప్రేమలో పడినప్పుడు తమ గర్ల్‌ఫ్రెండ్స్ కోసం ఎంతైనా ఖర్చు పెడతారు, వారు అడిగినవన్నీ కొనిస్తుంటారు. అయితే, అలా చేసి చేసి చివరకు తీవ్రంగా బాధపడిన ఓ యువకుడి కథే ఈ సినిమా అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. “అన్నీ నా దగ్గర నుంచే ఆశించడం కాదు.. నా కోసం నువ్వు ఏం చేశావు?” అని హీరో హీరోయిన్‌ను ప్రశ్నించే సరికొత్త కోణంతో ఈ లవ్ స్టోరీని తెరకెక్కించారు. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ముఖ్యంగా నేటితరం అబ్బాయిలకు బాగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood: ఇంట్లోకి వెళ్లగానే సావిత్రిగారిని అలా చూసి ఏడ్చేశా.. మనిషి చిన్నగా అయిపోయి.. టాలీవుడ్ నటి కామెంట్స్..
ఈ సినిమాలో పవిష్ నారాయణ్, నాగదుర్గ ప్రధాన జంటగా నటించారు. వీరితో పాటు కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు, నటుడు సెల్వ రాఘవన్, సీనియర్ నటుడు కేఎస్ రవికుమార్, వనిత విజయ్ కుమార్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మగేష్ రాజేంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వైవిధ్యమైన పాత్రలతో సినిమా చాలా కలర్‌ఫుల్‌గా సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ అందమైన, కాంటెంపరరీ ప్రేమకథా చిత్రం జులై 10న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. యూట్యూబ్ స్టార్‌గా మెరిసిన మన తెలంగాణ అమ్మాయి.. ఇప్పుడు తమిళంలో ఎలాంటి సక్సెస్ అందుకోబోతుందో చూడాలి.
ఎక్కువ మంది చదివినవి : Arundhati Movie: అరుంధతి సినిమాను రిజెక్ట్ చేసి తప్పు చేశాను.. అతడు మాటలు విని వదిలేశా.. టాలీవుడ్ హీరోయిన్..
లవ్ ఓ లవ్ ట్రైలర్..
ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆ హీరోలాంటి మనిషి ఇంకొకరు ఉండరు.. పద్మ శ్రీ వచ్చిందని తెలిసి ఏమన్నారంటే.. మురళి మోహన్..
