
ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్, తన అద్భుతమైన డాన్స్ తో ఈ అమ్మడు మంచి క్రేజ్ తెచ్చుకుంది. యూట్యూబ్ లో ఈ అమ్మడు చేసిన సాంగ్స్ తెగ వైరల్ అవుతుంటాయి. అలాగే మిలియన్ కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాయి మాధురి రాథోడ్ సాంగ్స్. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన బాల్యం, డాన్స్ పట్ల ఆమెకున్న అంకితభావం, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఆమె క్రేజ్ గురించి వివరంగా పంచుకుంది. ఈ ఇంటర్వ్యూలో మాధురి తన చిన్ననాటి గురించి చెబుతూ.. ఆమె ఏడుగురు తోబుట్టువులలో ఐదవదానినని తెలిపింది. తన తల్లి తన ముగ్గురు సోదరీమణులను డాన్స్ క్లాసులకు పంపినప్పటికీ, మాధురిని పంపలేదని తెలిపింది. అయినప్పటికీ, డాన్స్ పట్ల తనకున్న మక్కువ తనను ఆపలేదని. టీవీలో హీరో హీరోయిన్లను చూసి వారి స్టెప్పులను కాపీ చేస్తూ, ఎక్స్‌ప్రెషన్స్‌ను ప్రాక్టీస్ చేస్తూ స్వయంగా డాన్స్ నేర్చుకున్నా అని తెలిపింది. అలాగే ఆమె మాట్లాడుతూ.. తన సోషల్ మీడియా ప్రయాణాన్ని బీటెక్ ఫైనల్ ఇయర్‌లో టిక్‌టాక్‌తో మొదలుపెట్టిందట.. కాలేజీ ఫంక్షన్లలో డాన్స్ చేసే మాధురిని చూసిన స్నేహితులు, టిక్‌టాక్‌ను ఉపయోగించమని చెప్పారట. మొదట్లో డైలాగ్‌లు చెప్పినప్పటికీ, ఒకరోజు జానపద పాటపై డాన్స్ వీడియో చేయడంతో అది బాగా వైరల్ అయ్యింది. ఆమెను ఎక్కువగా జానపద పాటల డాన్సర్‌గా అభిమానులు గుర్తుపట్టారని తెలిపింది.
టిక్‌టాక్ నిషేధం తర్వాత, తాను ఇన్‌స్టాగ్రామ్ మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లను పెంచుకోవడానికి మాస్ బీట్ ఉన్న పాటలు, ముఖ్యంగా పాత పాటలను ఎంచుకొని డాన్స్ వీడియోలు చేసి క్రేజ్ తెచ్చుకున్నా అని తెలిపింది. “ఓల్డ్ సాంగ్స్ కూడా ట్రెండ్ అవుతాయని నేను నిరూపించాలనుకున్నాను” అని చెప్పుకొచ్చింది. అలాగే నటన పట్ల కూడా తనకు ఆసక్తి ఉందని, మంచి వెబ్ సిరీస్ లేదా ప్రాజెక్ట్ వస్తే తప్పకుండా చేస్తానని చెప్పారు.
ఇప్పటివరకు ఆమె సత్యభామ వెబ్ సిరీస్‌లో ఒక ఎపిసోడ్, శ్వేతా నాయుడు, మెహబూబ్ దిల్సేలతో కవర్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్‌లలో నటించారు. ఆమధ్య లక్కీ ఛాన్స్ అనే గేమ్ షోలో కూడా పాల్గొన్నారు. ఈ ప్రాజెక్ట్‌లకు ఎలా ఫండ్స్ వస్తాయో వివరిస్తూ, కొన్నిసార్లు ఫ్యాషన్ బొటిక్‌ల నుంచి దుస్తుల స్పాన్సర్‌షిప్‌లు లభిస్తాయని, మరికొన్నింటికి పేమెంట్స్ ఉంటాయని చెప్పారు. రామ్ చరణ్‌ను కలసిన అనుభవం గురించి మాట్లాడుతూ, ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ల సమయంలో ముంబైలో ఆయనతో కలిసి డిన్నర్ చేశామని, ఆయన జీరో ఆటిట్యూడ్‌తో చాలా సింపుల్‌గా మాట్లాడారని తెలిపారు. నటనలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నానని, తనకంటూ ఒక బ్రాండ్‌ను సృష్టించుకోవాలని షణ్ముఖ్ జస్వంత్ వంటి వారిని ఆదర్శంగా తీసుకుంటానని మాధురి రాథోడ్ అన్నారు.
ఇది కూడా చదవండి :
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.