
స్టార్ హీరో అజిత్ మరోసారి పెను ప్రమాదం నుంచి బయట పడ్డారు. హీరో అజిత్ సినిమాలతో పాటు కార్ రేస్ లోనూ పాల్గొంటారన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అజిత్ యూరప్‌లో జరిగిన ఎండ్యూరెన్స్ రేసింగ్ పోటీల్లో పాల్గొంటున్నారు. రేసింగ్ ట్రాక్‌పై వేగంగా దూసుకుపోతున్న అజిత్ కారు ఒక్కసారిగా అదుపు తప్పింది. ట్రాక్ పై హై స్పీడ్ లో దూసుకుపోతున్న అజిత్ కారు ఒక్కసారిగా అదుపుతప్పడంతో పక్కనున్న కారును ఢీ కొట్టింది. కాగా ఈ ప్రమాదంలో అజిత్ కు ఎలాంటి గాయాలు కాలేదు. కాగా ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అజిత్ కు ప్రమాదం తప్పడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇక అజిత్ ఇప్పటికే ఎన్నో రేస్ లలో పాల్గొన్నారు. ఇతర దేశాల్లో జరుగుతున్న పోటీల్లో ఇండియా తరుపున అజిత్ పాల్గొంటున్నారు. అజిత్ కారు ప్రమాదానికి గురి కావడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ ఆయన కారు ప్రమాదాలకు గురయ్యాయి. అంతకు ముందు దుబాయ్ రేసింగ్ ఈవెంట్ లోనూ, పోర్చుగల్ లో జరిగిన కార్ రేసింగ్ లోనూ, స్పెయిన్ లోని వాలెన్సియా రేస్ లో, అలాగే దుబాయ్ లో జరిగిన రేస్ లోనూ అజిత్ కారు ప్రమాదానికి గురయ్యింది.
అలాగే ఆయన సినిమాలతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ‘డేర్ డెవిల్స్’ చిత్రంలో నటిస్తున్నారు అజిత్. అజిత్ చివరిగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు అజిత్.
చూడటానికి అలా ఉంటుంది కానీ.. ఆమెకు పొగరెక్కువ..! సాయి పల్లవి నిజస్వరూపం ఇదే అంటున్న యంగ్ హీరో
అజిత్ కారు ప్రమాదం
#AjithKumar escaped unhurt after his No. 16 Ligier spun into the gravel at Spa Francorchamps in Belgium during the Michelin Le Mans Cup race on Saturday. pic.twitter.com/P4GXdUD2LF
— Movie Tamil (@_MovieTamil) August 24, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.