Pakkinti Kurradu: ప్రముఖ యూట్యూబర్.. పక్కింటి కుర్రాడు చందు అరెస్ట్.. మోసం చేశాడంటూ యువతి..

|

Dec 15, 2023 | 2:11 PM

చందు సాయి పక్కింటి కుర్రాడు గా బాగా పాపులర్ అయ్యాడు. సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్ లో అతడు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. అలాగే ఒకటి రెండు సినిమాల్లో కూడా కనిపించాడు. తాజాగా అతడిని నర్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువతీ చందు సాయి తనను అత్యాచారం చేశాడని , మోసం చేశాడని పోలీసులను ఆశ్రయించింది. దాంతో అతడి పై ఎఫ్ ఐ ఆర్ ఫైల్ చేశారు పోలీసులు. ఆతర్వాత అతడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 

Pakkinti Kurradu: ప్రముఖ యూట్యూబర్.. పక్కింటి కుర్రాడు చందు అరెస్ట్.. మోసం చేశాడంటూ యువతి..
Youtuber Chandu Sai
Follow us on

ప్రముఖ యూట్యూబర్ చందు సాయిని( పక్కింటి కుర్రాడు ) పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువతీ పై అత్యాచారం ఆరోపణల పై చందు సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. చందు సాయి పక్కింటి కుర్రాడు గా బాగా పాపులర్ అయ్యాడు. సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్ లో అతడు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. అలాగే ఒకటి రెండు సినిమాల్లో కూడా కనిపించాడు. తాజాగా అతడిని నర్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువతీ చందు సాయి తనను అత్యాచారం చేశాడని , మోసం చేశాడని పోలీసులను ఆశ్రయించింది. దాంతో అతడి పై ఎఫ్ ఐ ఆర్ ఫైల్ చేశారు పోలీసులు. ఆతర్వాత అతడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

చందు సాయి చాలా వెబ్ సిరీస్లు కూడా చేశాడు. అతడు వీడియోలకు మిళియన్స్ కొద్దీ వ్యూస్ కూడా వస్తాయి. ఇప్పటికే ఆతడు చాలా షార్ట్ ఫిలిమ్స్ లో కనిపించి మెప్పించాడు. అయితే గత కొంత కాలంగా అతను షార్ట్ ఫిలిమ్స్ కు దూరం అయ్యాడు. ఎందుకనో అతడు షార్ట్ ఫిలిమ్స్ లో కనిపించడం లేదు.

ఇక ఇప్పుడు ఓ యువతీ తన పై ఆరోపణలు చేయడంతో చందు సాయి పేరు వార్తల్లోకెక్కింది. మెసేజ్‌ ఓరియెంటెడ్‌, కామెడీ వీడియోల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పక్కింటి కుర్రాడు అరెస్ట్ పై మరింత వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..