Simbu: చిక్కుల్లో శింబు.. సినిమాల నుంచి బహిష్కరించాలని ప్రముఖ నిర్మాత ఫిర్యాదు

|

May 12, 2024 | 6:06 PM

కోలీవుడ్ స్టార్ హీరో శింబు పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమా విషయాలతో పాటు వివాదాల్లోనూ ఇతనూ పేరు తరచూ వినిపిస్తుంటుంది. ఇప్పుడు మరోసారి చిక్కుల్లో పడ్డాడీ స్టార్ హీరో. ఒక ప్రముఖ నిర్మాత శింబుపై ఫిర్యాదు చేశారు. తమిళ చిత్ర పరిశ్రమ వెంటనే అతనిపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు

Simbu: చిక్కుల్లో శింబు.. సినిమాల నుంచి బహిష్కరించాలని ప్రముఖ నిర్మాత ఫిర్యాదు
Simbu
Follow us on

కోలీవుడ్ స్టార్ హీరో శింబు పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమా విషయాలతో పాటు వివాదాల్లోనూ ఇతనూ పేరు తరచూ వినిపిస్తుంటుంది. ఇప్పుడు మరోసారి చిక్కుల్లో పడ్డాడీ స్టార్ హీరో. ఒక ప్రముఖ నిర్మాత శింబుపై ఫిర్యాదు చేశారు. తమిళ చిత్ర పరిశ్రమ వెంటనే అతనిపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. శింబు ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తున్న ‘థగ్ లైఫ్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడ చిత్రం ‘మఫ్తీ’కి రీమేక్‌గా వచ్చిన ‘పట్టు తాల’ చిత్రంలో శింబు నటించారు. అంతకు ముందు ‘వీడు తనిది కాదు’ సినిమాలో నటించాడు. ఈ సినిమా తర్వాత శింబు ‘కరోనా కుమార్’ అనే సినిమాలో నటించాల్సి ఉంది. ‘కరోనా కుమార్’ చిత్రానికి గోకుల్ ఎన్ కృష్ణ దర్శకత్వం వహించగా, ఇషారి కె గణేష్ నిర్మించాల్సి ఉంది. అయితే ఆ సినిమా నుంచి శింబు తప్పుకున్నాడు. కొన్ని అంతర్గత సమస్యల కారణంగా ‘కరోనా కుమార్’ సినిమా నుంచి శింబు తప్పుకున్నాడు. ఆ తర్వాత ‘పతు తాళ’ సినిమా మొదలుపెట్టాడు. అయితే ఇప్పుడు ‘కరోనా కుమార్’ నిర్మాత ఇషారి కె గణేష్ శింబుపై నిర్మాతల సంఘానికి ఫిర్యాదు చేశాశారు. షూటింగ్ ప్రారంభం కాకముందే శింభు మా నుంచి అడ్వాన్స్ తీసుకుని సినిమా నుంచి వెళ్లిపోయారని, ఆయనను తక్షణమే తమిళ చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు అతను నటిస్తున్న సినిమాతో పాటు మరే ఇతర సినిమాలో కూడా నటించకూడదని ఈ ఫిర్యాదులో తెలిపారు నిర్మాతలు.

 

ఇవి కూడా చదవండి

సిలంబరసన్ అలియాస్ శింబుకి ఇలాంటి వివాదాలు కొత్త కాదు. సినిమా షూటింగ్ విషయంలో శింబు క్రమశిక్షణా రాహిత్యాన్ని ప్రదర్శించాడని ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చాయి. దర్శకుడి పనిలో వేలు పెట్డం, షూటింగ్ సెట్‌లో వికృతంగా ప్రవర్తించడం. నిర్మాతలతో డబ్బు పంచుకోవడంపై విబేధాలు వంటి అనేక వివాదాలను శింబు గతంలో ఎదుర్కొన్నారు. శింబుపై గతంలోనూ నిర్మాతల సంఘం, దర్శకుల సంఘాలకు ఫిర్యాదులు అందాయి. మరి ఈ వివాదం నుంచి శింబు ఎలా బయటపడతాడో, తమిళ చిత్ర పరిశ్రమ ఎలా స్పందిస్తుందో చూడాలి.

థగ్ లైఫ్ సినిమాలో శింబు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.