Unstoppable With NBK: పేదల ఆకలి తీరుస్తున్న మల్లేశ్వరావు.. చలించిపోయిన బాలయ్య

|

Nov 05, 2022 | 7:38 PM

మొదటిసారి బాలకృష్ణ హౌస్ట్ గా చేస్తున్న ఈ టాక్ షో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే మొదటి సీజన్ పూర్తి చేసుకున్న ఈ టాక్ షో ఇప్పుడు సెకండ్ సీజన్ లోకి అడుగు పట్టింది.

Unstoppable With NBK: పేదల ఆకలి తీరుస్తున్న మల్లేశ్వరావు.. చలించిపోయిన బాలయ్య
Balakrishna
Follow us on

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న అన్ స్టాపబుల్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో ఇండియాలోనే నెంబర్ వన్ గా నిలబెట్టారు బాలయ్య. మొదటిసారి బాలకృష్ణ హౌస్ట్ గా చేస్తున్న ఈ టాక్ షో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే మొదటి సీజన్ పూర్తి చేసుకున్న ఈ టాక్ షో ఇప్పుడు సెకండ్ సీజన్ లోకి అడుగు పట్టింది. బాలకృష్ణ ఎంత సరదా మనిషో చాలా తక్కువ మంది.. ఆయనతో సన్నిహితంగా ఉండే వాళ్ళకే తెలుసు. అయితే అన్ స్టాపబుల్ షో తో బాలకృష్ణ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. సినిమాల్లో ఎంతో ఎనర్జీగా ఉండే బాలయ్య. ఈ టాక్ షోను డబుల్ ఎనర్జీతో నడిపిస్తున్నారు.

ఇక సీజన్ 2లో మొదటి ఎపిసోడ్ కు తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు గెస్ట్ గా హాజరయ్యారు. ఆతర్వాత కుర్ర హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ హాజరుకాగా రీసెంట్ గా మరో ఇద్దరు యంగ్ హీరోలు శర్వానంద్, అడవి శేష్ గెస్టులుగా వచ్చారు. ఈ ఎపిసోడ్ ఎంతో సరదాగా సాగింది. బాలయ్య చిలిపి ప్రశ్నలకు ఈ ఇద్దరు యంగ్ హీరోలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

అయితే ప్రతి ఎపిసోడ్ చివరిలో బాలకృష్ణ సమాజంలో మంచి పనులు చేసే వ్యక్తులను పిలిచి సన్మనిస్తుంటారు. అలాగే రీసెంట్ ఎపిసోడ్ లో కూడా మహేశ్వర రావు అనే వ్యక్తిని సన్మానించారు. తాను పడ్డ ఆకలి బాధ మరొకరు పడకూడదని. డైలీ హోటల్ లో మిగిలిపోయిన ఆహారాన్ని ఆకలితో బాధపడే వారికీ ఇస్తుంటాడు మల్లేశ్వరావు అనే మహా మనిషి. తాను హోటల్ లో పనిచేస్తూ.. మిగిలిపోయిన ఆహారాన్ని రోడ్డు పై ఆహారాన్ని పంచుతూ ఉంటాడు. డోంట్ వెస్ట్ ఫుడ్ అంటూ ఒక్కరితో మొదలైన ఆయన ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిని నింపింది. ఎంతో మంది ఆకలి తీర్చారు మల్లేశ్వరావు ను సన్మానించారు బాలయ్య.

ఇవి కూడా చదవండి

దీనిపై మల్లేశ్వరరావు సోషల్ మీడియాలో స్పందిస్తూ.. “హెల్త్ ప్రాబ్లం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్న నేను సర్వీస్ కొంచెం తగ్గించాను, అయినా మా టీం వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. ఇలా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్న నన్ను,నలుగురికి అన్నం పెట్టేవాడు ఎప్పుడు అన్ స్టాపబుల్, బాలయ్య బాబు గారు నన్ను షోకు ఇన్వైట్ చేయడం జరిగింది. ఒక వ్యక్తిని ఎప్పుడైనా కలిస్తే అయితే మాట్లాడుతాం, నమస్కారం పెడతాం, కానీ బాలయ్య ని ఒకసారి కలిస్తే ఎవరైనా గాని ఆయనకి అభిమాని అవ్వక తప్పదు. ఈరోజు రిలీజ్ అయిన ఎపిసోడ్ లో నన్ను బాలయ్య బాబుని ఒక స్టేజి మీద చూశారు ధన్యవాదాలు. అంటూ రాసుకొచ్చారు. అలాగే ఆ మంచి మనిషికి స్కూటీని, స్మార్ట్ ఫోన్ ను గిఫ్ట్ ఇచ్చారు. అలాగే ఒక లక్ష రూపాయిలు ఆర్థిక సాయం అందించారు.

Unstoppable With Nbk 2