Tollywood: అమ్మాయి వాయిస్‌తో అదరగొడుతున్న ఆద్య హనుమంతు..

|

Dec 23, 2024 | 2:28 PM

ఓ అబ్బాయి అచ్చం అమ్మాయిలా మాట్లాడుతూ ఎన్నో సినిమాలకు ఎందరో ప్రముఖ హీరోయిన్లకు డబ్బింగ్‌ చెప్పాడంటే నమ్మగలరా? కానీ అది నిజం. తెలుగులో ఎంతో మంది హీరోయిన్లకు తన గాత్రాన్ని అందించాడు. అసలు ఎవరు ఈ ఆద్య హనుమంతు.. ? తన గురించి వివరాలు తెలుసుకుందాం.

Tollywood: అమ్మాయి వాయిస్‌తో అదరగొడుతున్న ఆద్య హనుమంతు..
Adya Hanmanthu
Follow us on

మీరు చాలా మంది మిమిక్రీ ఆర్టిస్టులను చూసుంటారు. వారు ప్రముఖుల వాయిస్‌ను ఇమిటేట్‌ చేస్తూ ఔరా అనిపిస్తారు. అయితే కేవలం పురుషుల వాయిస్‌ను మాత్రమే వారు ఇమిటేట్‌ చేయగలుగుతారు. మహిళల వాయిస్‌ ఇమిటేట్‌ చేసినా అది తెలిసిపోతుంది. కానీ ఓ అబ్బాయి అచ్చం అమ్మాయిలా మాట్లాడుతూ ఎన్నో సినిమాలకు ఎందరో ప్రముఖ హీరోయిన్లకు డబ్బింగ్‌ చెప్పాడంటే నమ్మగలరా? కానీ అది నిజం. ఆ వాయిస్‌ వింటున్నప్పుడు ఎవరీ అమ్మాయి ఇంత అందంగా మాట్లాడుతోంది అనిపించక మానదు. వాయిస్‌ తో పాటు ఆ వాయిస్‌లో పలికే ఎక్స్‌ప్రెషన్స్‌ వల్ల ఆ వాయిస్‌ ఆ హీరోయిన్‌దే అనుకొని వారికి ఫ్యాన్స్ అయిపోతుంటారు. అందటి మధురమైన వాయిస్‌ అతని సొంతం. పోనీ అతను అమ్మాయి వాయిస్‌ కోసం ఏమైనా ప్రాక్టీస్‌ చేశాడా? మిమిక్రీ నేర్చుకున్నాడా అంటే అదీ లేదు. ఆయనకు అది స్వతహాగా వచ్చిందంటున్నాడు. ఆయనే ఆద్య హనుమంతు.

ఆద్య హనుమంతు కేవలం డబ్బింగ్‌లోనే కాదు, చదువు, సంగీతం, నృత్యం, నటన అన్నింటిలోనూ సత్తా చాటుతున్నాడు. అంతేనా.. మెడిసిన్‌ కూడా చదువుతున్నాడు. డబ్బింగ్ చెప్పడం హాబీగా మొదలుపెట్టిన ఆద్య హనుమంతు అనతికాలంలోనే ఎందరో టాప్‌ హీరోయిన్లకు తన గాత్రాన్ని అందించాడు. సమంత, సాయిపల్లవి, రాశీఖన్నా, ఇలా ఎందరో తెలుగు, తమిళ, కన్నడ హీరోయిన్లకు తన వాయిస్ ఇచ్చాడు. 2023లో జాతీయ ఉత్తమ వాయిస్​ ఓవర్ అవార్డును దక్కించుకున్నాడు. ప్రస్తుతం, ఆద్య.. బెంగళూరులోని విశ్వేశ్వర టెక్నాలజీ యూనివర్సిటీలో పీజీ చదువుతున్నాడు. తనకు ఎంతో ప్రేరణ ఇచ్చిన యూనివర్సిటీ ప్రొఫెసర్లలో డాక్టర్ పంకజాక్షి రవిష్ మేడమ్ గురించి ఆయన ప్రత్యేకంగా చెప్పాడు. తన సీనియర్స్‌, జూనియర్స్‌, ఇంకా ప్రొఫెసర్లు ఎంతో ప్రోత్సహించారని తెలిపాడు. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా తన ప్రతిభను చాటుతూ ఎందరికో స్పూర్తిగా నిలుస్తున్నాడు ఆద్య హనుమంతు.

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.