పుష్ప2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు రాజకీయ నేతలు తీవ్రమైన వ్యాఖ్యలు చేయడమే దీనికి ప్రధాన కారణం. ఇక అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరగడంతో ఇది మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. తెలంగాణలో అధికార, విపక్ష పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఇదే అంశంపై ప్రముఖ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వరుసగా పోస్టులు పెట్టారామె. ‘ఒక సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఈ సంఘటన చాలా దురదృష్టకరం. అయితే ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో విభజన రేఖలు తెచ్చే వరకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజుల పరిణామాలు, ప్రెస్ మీట్లు తదనంతర భావోద్వేగాలలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసుందాం అనే నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అట్లా కాక మల్లా ప్రజల మనోభావాల మధ్య విభజనలు వచ్చే వరకు నడవాలనేది ఈ సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీల ప్రయోగంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా ఒక సంఘటనను బీజేపీ తమకు అనుకూలంగా చేసుకునే ప్రక్రియగా ఈ అంశంల తెలంగాణ, ఏపీ రాష్ట్రాల బీజేపీ నేతల ప్రకటనలు కనబడుతున్నవి. సినిమా పరిశ్రమను నాశనం చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీజేపీ కేంద్ర మంత్రులు ఆరోపణ చెయ్యడం గర్హనీయం. ఇదంతా, అన్ని ప్రాంతాల ప్రజల ఆదరణ కావలసిన సినిమా పరిశ్రమకు ఎంత అవసరం అన్న విశ్లేషణ సినిమా పరిశ్రమ కూడా పరిశీలన చేయాలి. సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం జరగాలి. హర హర మహాదేవ్. జై తెలంగాణ’ అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు రాములమ్మ
‘సంధ్య థియేటర్ హైదరాబాద్ సంఘటన దృష్ట్యా.. చట్టం ప్రకారం, బాధితుల కుటుంబ ఫిర్యాదుల అనుసారం నమోదైన కేసులు, పోలీసుల కార్యాచరణ, కోర్టు విచారణ… ఆ తర్వాత బెయిల్‌పై విడుదల..ఈ మొత్తంలో ప్రభుత్వ ధోరణి తప్పితే ప్రత్యేకించి పక్షపాతం అనే పరిస్థితి ఎక్కడుంది? విమర్శకుల విమర్శలు మామూలే. ఏదో ఒక ప్రోద్బలంతో ఒక మూవీ హీరోని, సెలబ్రిటీ ఆర్టిస్ట్స్‌ను వేధించాలి, లేదా ఏదో కష్టం కల్పించాలి అన్న అంశం, తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి కి ఉన్నదనే ఆరోపణ ఇక్కడ అవాస్తవం. హర హర మహాదేవ్. జై తెలంగాణ’ అని మరో ట్వీట్ చేశారు విజయ శాంతి.
ఒక సినిమా విడుదల సందర్భంగా జరిగిన దురదృష్ట సంఘటన ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య తెలంగాణల విభజన రేఖలు తెచ్చే వరకు వెళుతున్నట్లు, గత రెండు రోజుల పరిణామాలు, ప్రెస్ మీట్లు తదనంతర భావోద్వేగాలు అగుపడుతున్నవి.
ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసుందాం అనే నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అట్లా…
— VIJAYASHANTHI (@vijayashanthi_m) December 22, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి