AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fish Venkat: ఫిష్ వెంకట్ బతకాలంటే అదొక్కటే మార్గం.. నటుడి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ కీలక ప్రకటన

టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నాడు. 100కు పైగా సినిమాల్లో నటించి నవ్వించిన ఫిష్ వెంకట్ ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు, సినీ అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Fish Venkat: ఫిష్ వెంకట్ బతకాలంటే అదొక్కటే మార్గం.. నటుడి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ కీలక ప్రకటన
Actor Fish Venkat
Basha Shek
|

Updated on: Jul 03, 2025 | 8:24 PM

Share

టాలీవుడ్ ప్రముఖ నటుడు  ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. కిడ్నీ సంబంధిత సమస్యలతో పాటు షుగర్, బీపీ వ్యాధులతోనూ పోరాడుతున్నాడు. గతంలో తీవ్ర అనారోగ్యంతో గాంధీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నాడు. అప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రూ.2 లక్షల ఆర్థిక సాయం చేశారు. దీంతో కొన్ని రోజులు బాగానే ఉన్నాడీ నటుడు. అయితే మళ్లీ ఇప్పుడు ఆస్పత్రి పాలయ్యాడు ఫిష్ వెంకట్. తీవ్ర అనారోగ్యం పాలు కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నాడు. మరోవైపు ఫిష్ వెంకట్ చికిత్స కోసం సాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని నటుడి భార్య, కూతురు చేతులెత్తి మొక్కుతున్నారు. కాగా ఫిష్ వెంకట్ కు సరైన చికిత్స అందితే బతికే ఛాన్స్ ఉందని వైద్యులు చెబుతున్నారు.

‘వెంకట్ కిడ్నీ సమస్యకు డయాలసిస్ చేయించుకుంటున్నారు. కానీ ఆయన పరిస్థితి ఇప్పుడు మరింత క్షీణించింది. ఇప్పుడు అవయవ మార్పిడి చేస్తే ఆయన ప్రాణాలకు ముప్పు తప్పుతుంది. ప్రస్తుతం ఆయనను బతికించుకునేందుకు ఇదొక్కటే మార్గం. ప్రస్తుతం డయాలసిస్ చేస్తే ఫిష్ వెంకట్ పరిస్థితి మెరుగవచ్చు… కానీ మళ్లీ సిక్ అవ్వడంఖాయం. పైగా ఆయన ఎక్కువగా స్పృహలో ఉండటం లేదు. ఒక్క డయాలసిస్ చేసినప్పుడు మాత్రమే ఆయన కాస్త మెరుగ్గా కనిపిస్తున్నారు వీలైనంత త్వరలో ఆయనకు కిడ్నీను మారిస్తే బ్రతికే అవకాశం ఉంది’ అని వైద్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

100కు పైగా సినిమాల్లో.. ఇప్పుడిలా..

ఫిష్ వెంకట్ 100కు పైగా చిత్రాల్లో నటించి నవ్వించారు. ఆది, చెన్నకేశవ రెడ్డి, దిల్, బన్నీ, ఢీ, దుబాయ్ శ్రీను, కృష్ణ, బుజ్జిగాడు, రెడీ, ఆంజనేయులు, అదుర్స్, మిరపకాయ్, కందిరీగ, రచ్చ, గబ్బర్ సింగ్, బలుపు, అత్తారింటికి దారేది తదితర సూపర్ హిట్ సినిమాల్లో తన కామెడీతో కడుపుబ్బా నవ్వించారు. అలాంటి ఆయన ఇప్పుడు ఆస్పత్రి బెడ్ పై ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీ అభిమానులు ఫిష్ వెంకట్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

ఆస్పత్రి వెంటిలేటర్ పై ఫిష్ వెంకట్.. వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ALLU ARJUN: అట్లీతో అండర్ వాటర్ అడ్వెంచర్.. సందీప్‌తో వైల్డ్ రైడ్
ALLU ARJUN: అట్లీతో అండర్ వాటర్ అడ్వెంచర్.. సందీప్‌తో వైల్డ్ రైడ్
2025లో టెక్నాలజీలో భారత్ సత్తా.. ప్రపంచమే మన వైపు చూస్తుంది..
2025లో టెక్నాలజీలో భారత్ సత్తా.. ప్రపంచమే మన వైపు చూస్తుంది..
ఆన్‌లైన్‌ ఆర్డర్‌ ప్యాకేజ్‌ ట్యాంపరింగ్‌కు గురైందని తెలుసుకోవచ్చా
ఆన్‌లైన్‌ ఆర్డర్‌ ప్యాకేజ్‌ ట్యాంపరింగ్‌కు గురైందని తెలుసుకోవచ్చా
VARANASI: "నట దాహార్తిని తీర్చుతోంది" అంటున్న పాపులర్​ యాక్టర్
VARANASI:
IPL క్రికెట్ లో భారీగా సంపాదిస్తున్న హీరోయిన్..
IPL క్రికెట్ లో భారీగా సంపాదిస్తున్న హీరోయిన్..
ఈ స్టార్ హీరో డైలీ షెడ్యూల్ వింటే షాక్ అవ్వాల్సిందే!
ఈ స్టార్ హీరో డైలీ షెడ్యూల్ వింటే షాక్ అవ్వాల్సిందే!
ఉదయం vs సాయంత్రం: ఎక్సర్‌సైజ్ చేయడానికి ఏది బెస్ట్ టైమ్..?
ఉదయం vs సాయంత్రం: ఎక్సర్‌సైజ్ చేయడానికి ఏది బెస్ట్ టైమ్..?
టైరు పేలి అదుపుతప్పిన ప్రభుత్వ బస్సు.. 9మంది మృత్యువాత
టైరు పేలి అదుపుతప్పిన ప్రభుత్వ బస్సు.. 9మంది మృత్యువాత
చిన్న ట్రిక్‌తో సైకాలజిస్టులను కూడా ఫిదా చేసిన హీరోయిన్ అనుష్క
చిన్న ట్రిక్‌తో సైకాలజిస్టులను కూడా ఫిదా చేసిన హీరోయిన్ అనుష్క
ముగ్గురు అక్కాచెల్లెళ్లతో మహేష్ బాబు.. ఫ్యామిలీ ఫొటోస్ వైరల్
ముగ్గురు అక్కాచెల్లెళ్లతో మహేష్ బాబు.. ఫ్యామిలీ ఫొటోస్ వైరల్