చాలా మంది ముద్దుగుమ్మలు తక్కువ సినిమాలతోనే ప్రేక్షకులను మెప్పించి ఆతర్వాత కనిపించకుండా మాయం అవుతుంటారు. పెద్ద హీరోల సినిమాలతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. అదృష్టం కలిసి రాక.. వరుస ఫ్లాప్స్ అందుకొని సినిమాలకు దూరం అవుతుంటారు. పై ఫొటోలో కనిపిస్తున్న భామ కూడా అంతే.. నేచురల్ స్టార్ నాని సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా బాగానే పెంచుకుంది. వరుస ఆఫర్స్ అందుకుంది. కానీ చేసిన సినిమాలన్నీ నిరాశపరచడంతో ఇప్పుడు ఆఫర్స్ లేకుండా పోయాయి. ఇంతకూ ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి బడా హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. అందం, అభినయం ఉన్న ఆ భామ ఇప్పుడు ఆఫర్స్ లేక ఏం చేస్తుందంటే..
పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు హాట్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మజ్ను సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ వయ్యారి భామ. ఆతర్వాత వరుస గా ఆఫర్స్ అందుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్ సినిమాలు చేసింది. ఆతర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసింది.
అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా సినిమాలో చేసింది కానీ ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. శైలజారెడ్డి అల్లుడు, అల్లుడు అదుర్స్, ఊర్వశివో రాక్షసివో సినిమాలు చేసింది కానీ ఆ సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అలాగే తమిళ్ లోనూ నటించింది అక్కడ కూడా ఇదే పరిస్థితి. దాంతో ఈ అమ్మడుకి ఇప్పుడు ఆఫర్స్ తగ్గాయి. అయితే సినిమాలు లేకపోయిన అను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సినిమాలు లేకపోవడంతో ఈ అమ్మడు సోషల్ మీడియాతోనే బిజీగా గడిపేస్తోంది. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంది. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ బ్యూటీ లేటెస్ట్ గ్లామరస్ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.