Tollywood : ఈ చిరునవ్వుల చామంతి ఎవరో గుర్తుపట్టారా..? అచ్చం పక్కింటి అమ్మాయే ఆమె..

కొంతమంది హీరోయిన్స్ తమ నటనతో ఎంతో  మంది అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా.? ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులందరిని, ముఖ్యంగా కుర్రాళ్లను కట్టిపడేసింది ఆ బ్యూటీ. చూడటానికి అచ్చం పక్కింటి అమ్మాయిలా కనిపించి.. నటించి మెప్పించింది ఈ బ్యూటీ.

Tollywood : ఈ చిరునవ్వుల చామంతి ఎవరో గుర్తుపట్టారా..? అచ్చం పక్కింటి అమ్మాయే ఆమె..
Actress
Follow us

|

Updated on: Aug 08, 2024 | 1:12 PM

చాలా మంది ముద్దుగుమ్మలు ఒకటి రెండు సినిమాతోనే ప్రేక్షకులను మెప్పిస్తూ దూసుకుపోతున్నారు. తమ అందం అభినయంతో ఆకట్టుకుంటున్న బ్యూటీలు చాలా మంది ఉన్నారు. కొంతమంది హీరోయిన్స్ తమ నటనతో ఎంతో  మంది అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా.? ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులందరిని, ముఖ్యంగా కుర్రాళ్లను కట్టిపడేసింది ఆ బ్యూటీ. చూడటానికి అచ్చం పక్కింటి అమ్మాయిలా కనిపించి.. నటించి మెప్పించింది ఈ బ్యూటీ. అవ్వడానికి మలయాళీ భామే అయినా అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ ఇప్పుడు కుర్ర హీరోలకు ఫస్ట్ ఛాయిస్‌గా మారింది. ఇంతకు పై ఫొటోలో చిరు నవ్వులు చిందిస్తున్న ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?

హీరోలకు సరి సమానంగా డాన్స్‌లతోనూ ఇరగదీస్తోంది ఈ ముద్దుగుమ్మ. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలే చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే గుర్తుపట్టి ఉంటారే.. చారడేసి కళ్ళతో అందమైన నవ్వుతో ఆకట్టుకుంటున్న ఈ చిన్నారి ఎవరో కాదు.. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి.

శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది సాయి పల్లవి. సహజమైన అందంతోనే కాదు సహజమైన నటనతో ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. కేవలం తెలుగు సినిమాల్లోనే కాదు. తమిళ్.. మలయాళ సినిమాల్లోనూ నటిస్తూ ఆకట్టుకుంటుంది సాయి పల్లవి. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సాయి పల్లవి ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం నాగ చైతన్య నటిస్తున్న తండేల్ మూవీ చేస్తోంది. అలాగే బాలీవుడ్ లో రామాయణం సినిమా చేస్తుంది. ఈ సినిమాలో సీత పాత్రలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. తాజా సాయి పల్లవి చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. క్యూట్ లుక్స్ తో కవ్విస్తున్న సాయి పల్లవి ఫోటోను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

సాయి పల్లవి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.