బురఖాలో మెరిసిన క్రేజీ బ్యూటీ.. చార్మినార్ దగ్గర సీక్రెట్ షాపింగ్.. ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.?

బిగ్ బాస్ పుణ్యమా అని చాలా మంది భామలు క్రేజ్ తెచ్చుకున్నారు. కొంతమంది బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమాల్లో బిజీ అయితే మరికొంతమంది సోషల్ మీడియాతో బిజీగా గడుపుతున్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. తాజాగా ఆమె వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.

బురఖాలో మెరిసిన క్రేజీ బ్యూటీ.. చార్మినార్ దగ్గర సీక్రెట్ షాపింగ్.. ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.?
Actress

Updated on: Mar 17, 2026 | 4:27 PM

అందంలో అప్సర ఆమె.. సోషల్ మీడియాలో సెన్సేషన్ ఆమె.. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నా ఆ అమ్మడికి హీరోయిన్స్ కు సమానమైన క్రేజ్ ఉంది. అందం అభినయంతో ఆకట్టుకున్న ఆ చిన్నది. బిగ్ బాస్ గేమ్ షోలోనూ అదరగొట్టింది. తన ఆటతో పాటు అందంతోనూ ప్రేక్షకులను కవ్వించింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బిజీ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. హీరోయిన్ గా ఒకటి రెండు సినిమాలు చేసినా అవి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దాంతో సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలతో అదరగొడుతుంది. రీసెంట్ గా బురఖా ధరించి చార్మినార్ ఏరియాలో చక్కర్లు కొట్టింది. ఎవ్వరూ గుర్తుపట్టకుండా బురఖాలో తిరుగుతూ చార్మినార్ దగ్గర షాపింగ్ చేసింది ఆ చిన్నది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్ అయ్యింది.

Pawan Kalyan: రాజకీయాల్లోకి రావచ్చుగా.. హీరోయిన్‌కు పవన్ కళ్యాణ్ ఆఫర్.. కానీ ఆమె ఏం చెప్పిందంటే

ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టారా.? ఆ అమ్మడిని గుర్తుపట్టడం పెద్ద కష్టమేమీ కాదు. ఆమె ఎవరంటే.. బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న నటి దివి. ఈ అందాల భామ కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేసింది. మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత బిగ్ బాస్ గేమ్ షోలో ఛాన్స్ అందుకుంది. బిగ్ బాస్ లో తన ఆటతో ఆకట్టుకుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది.

ఇవి కూడా చదవండి

వెంకటేష్ నా ప్రాణం కాపాడారు.. ఆ రోజు ఆయన లేకపోయి ఉంటే వామ్మో..!!

అలాగే దివి ప్రధాన పాత్రల్లోనూ నటించింది. లంబాసంగి అనే సినిమాలో దివి ప్రధాన పాత్రలో కనిపించింది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తుంది. ఈ క్రమంలోనే బురఖా వేసుకొని చార్మినార్ దగ్గర షాపింగ్ చేసిన వీడియోను పంచుకుంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రంజాన్ మాసం కావడంతో చార్మినార్ దగ్గర వాతావరణం సందడిగా ఉంటుంది. ప్రజలు చార్మినార్ దగ్గర షాపింగ్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.

Roja Selvamani: స్టార్ హీరో ఇంటికి కోడలిగా రోజా కూతురు..? ఇదిగో క్లారిటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us