Childhood Photo: ఈ ఫొటోలో క్యూట్‌గా ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ క్రేజీ హీరోయిన్.. హీటు పుట్టించే ఫొటోలతో సోషల్ మీడియా షేక్ చేస్తోంది

|

Dec 29, 2022 | 7:24 PM

పై ఫొటోలో కనిపిస్తోన్న చిన్నారి కూడా ఇప్పుడు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది . ఇక ఈ చిన్నది అందమా ఆరబోతలో కూడా ఏమాత్రం మొహమాట పడటంలేదు.

Childhood Photo: ఈ ఫొటోలో క్యూట్‌గా ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ క్రేజీ హీరోయిన్.. హీటు పుట్టించే ఫొటోలతో సోషల్ మీడియా షేక్ చేస్తోంది
Actress
Follow us on

ఇటీవల కాలంలో టాలీవుడ్ కు కొత్త అందాలు పలకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా మంది హీరోయిన్ లు తెలుగులో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. పై ఫొటోలో కనిపిస్తోన్న చిన్నారి కూడా ఇప్పుడు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది . ఇక ఈ చిన్నది అందమా ఆరబోతలో కూడా ఏమాత్రం మొహమాట పడటంలేదు. ఇంతకు ఇంత క్యూట్ గా ఉన్న ఈ కుర్రది ఎవరో గుర్తుపట్టారా..? చేసింది తక్కువ సినిమాలే అయినా కుర్రాళ్ల మనస్సులో స్థానం సంపాదించుకుంది ఈ భామ. ఇంతకు ఈ బ్యూటీ ఎవరంటే ..

పై ఫొటోలో క్యూట్ గా నవ్వుతు కనిపిస్తోన్న కుర్రది ఎవరో కాదు ముద్దగుమ్మ కేతిక శర్మ. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తొలి సినిమాలోనే అందాలు ఆరబోసి ఆకట్టుకుంది ఈ చిన్నది. ఇక ఈ సినిమాలో లిప్ లాక్ సీన్స్ లో కూడా రెచ్చిపోయింది.

ఇవి కూడా చదవండి

అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత నాగశౌర్య నటించిన లక్ష్య సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అలాగే మెగా హీరో వైష్ణవ తేజ్ హీరోగా నటించిన రంగరంగ వైభవంగా సినిమాలో నటించింది ఈ మూవీ కూడా అంతే.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రోజు పిచ్చెక్కించే ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్ళకు నిద్రపట్టకుండా చేస్తోంది కేతిక.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.