
హీరోయిన్స్ కు సంబందించిన ఫోటోలు, వీడియోలు కనిపిస్తే చాలు నెటిజన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తారు. ఆ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ తెగ సందడి చేస్తుంటారు నెటిజన్స్. హీరోయిన్ పుట్టిన రోజున, లేదా ఏదైనా అకేషన్స్ సమయంలో హీరోయిన్ ఫోటోలను సోషల్ మీడియాలోషేర్ చేస్తూ ఉంటారు. ఇక ముద్దుగుమ్మల లేటెస్ట్ ఫోటోల దగ్గర నుంచి చిన్ననాటి ఫోటోల వరకు ప్రతిదీ సోషల్ మీడియాలో దర్శనమిస్తూ ఉంటాయి. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకూ పై ఫొటోలో క్లాసిక్ డాన్స్ చేస్తున్న ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఓ నాట్య మయూరి. తెలుగులో తోపు హీరోయిన్.. ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు. ఇంతకూ ఆమె ఎవరంటే..
పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న భామ. ఇప్పుడు ఎక్కడ చూసిన ఆమె పేరే వినిపిస్తుంది. స్టార్ హీరోలు కూడా ఈ చిన్నదాని డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆమె మరెవరో కాదు అందాల భామ శ్రీ లీల. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ చిన్నది. తొలి సినిమాతోనే తన అందంతో అల్లరితో ఆకట్టుకుంది. ఆతరువాత రవితేజ నటించిన ధమాకా సినిమాతో హిట్ అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది.
కాగా ధమాకా సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయింది శ్రీలీల. యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలతోనూ నటించి అక్కట్టుకుంది ఈ వయ్యారి భామ. మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాలో మెరిసింది. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో చేస్తుంది. శ్రీలీల తెలుగుతో పాటు ఇప్పుడు హిందీలోకి కూడా అడుగుపెడుతుంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమాకు దర్శకుడు అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి