అప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పుడు సినిమాలు మానేసి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా రాణించారు. నాగార్జునతో సహా పలువురు స్టార్ హీరోల సరసన 50కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. సినిమాలకు దూరమయ్యాక, అజిత్‌తో ప్రేమ, ఆతర్వాత వివాహం, విడాకులు చకచకా జరిగిపోయాయి.

అప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పుడు సినిమాలు మానేసి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
Actress

Updated on: Sep 11, 2026 | 9:50 PM

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణులలో హీరా రాజగోపాల్ ఒకరు. అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున సరసన “ఆవిడా మా ఆవిడే” చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. చెన్నైకి చెందిన హీరా, “పబ్లిక్ రౌడీ” చిత్రంతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత “లిటిల్ సోల్జర్స్”, “ఆహ్వానం”, “శ్రీకారం”, “అంతఃపురం” వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించి తన నటనతో ఆకట్టుకున్నారు.

ఆ హీరోయిన్‌ను చూస్తే ఎవ్వరికైనా గౌరవం ఇవ్వాలనిపిస్తుంది.. చాలా మంచింది : గుణశేఖర్

డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన “దొంగా దొంగా” వంటి సినిమాలతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ్, మలయాళం భాషలలో కలిపి 50కి పైగా సినిమాల్లో నటించిన హీరా, బహుభాషా నటిగా నిరూపించుకున్నారు. అయితే, 1999లో విడుదలైన “స్వయంవరం” ఆమె చివరి చిత్రం. ఆ తర్వాత ఆమె సినిమాలకు దూరమయ్యారు. కోలీవుడ్ హీరో అజిత్‌తో ఆమె ప్రేమలో ఉన్నారనే వార్తలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. 2002లో పుష్కర్ మాధవ్‌ను వివాహం చేసుకున్న హీరా, 2006లో విడాకులు తీసుకున్నారు.

BiggBoss 10: అమ్మబాబోయ్.. ఒకొక్కరికి అంత రెమ్యునరేషనా..! అందరికంటే ఎక్కువ ఎవరికో తెలుసా

హీరా చెన్నైలోని మహిళా క్రిస్టియన్ కళాశాల నుంచి సైకాలజీలో డిగ్రీ చేసింది. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. చివరిగా 1999లో స్వయంవరం చిత్రంలో నటించారు. ఆ తర్వాత ఏ సినిమాలోనూ నటించలేదు. ప్రస్తుతం హీరా రాజగోపాల్ అమెరికాలో ఒంటరి జీవితం గడుపుతున్నారు. సినిమాలకు, సోషల్ మీడియాకు దూరంగా ఉన్న హీరా లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతున్నాయి, ఆమె అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

BiggBoss10: ఊహించని ట్విస్ట్.. హౌస్ నుంచి ఫస్ట్ ఎలిమినేషన్.. అతను అవుట్.?

Heera Rajagopal

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us