మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీస్‌లో ఘరానా మెగుడు ఒకటి. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నగ్మా మెయిన్ హీరోయన్‌గా నటించగా, సెకెండ్ హీరోయిన్గా వాణీ విశ్వనాథ్ కనిపించింది. ఈ సినిమాలో నగ్మా పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో, వాణీ విశ్వనాథ్ క్యారెక్టర్ అంతే కీలకం. ముఖ్యంగా చిరంజీవి-వాణీ విశ్వనాథ్ కాంబినేషన్లో వచ్చిన సీన్లు, పాటలు సినిమా విజయంలో హైలెట్‌గా నిలిచాయి. మూవీలో వీరి మధ్య వచ్చే ‘ కిటుకిలు తెలిసిన’ అనే రెయిన్ సాంగ్ ఎవర్గ్రీన్ రొమాంటిక్ సాంగ్‌గా నిలిచిపోతుంది. అలా ఘరానా మొగుడు సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకుంది వాణీ విశ్వనాథ్. ఈ సినిమా తర్వాత నా మొగుడు నాకే సొంతం, మా ఇంటి కథ, కొదమ సింహం, వదిన గారి గాజులు, ప్రేమ చిత్రం పెళ్ళి విచిత్రం, మామా – కోడలు, లేడీస్ స్పెషల్, జోకర్ తదితర సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా చేరువైంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ నటించి మెప్పించిందీ అందాల తార. అయితే సినీ కెరీర్ పీక్స్ లో ఉండగానే వాణీ విశ్వనాథ్.. ప్రముఖ మలయాళ నటుడు బాబూరావును ప్రేమించి పెళ్లిచేసుకుంది.
2002లో పెళ్లి చేసుకన్న వాణీ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహం అనంతరం జయజానకి నాయక వంటి సినిమాల్లో కూడా నటించిన వాణీ రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. తెలుగు దేశం పార్టీలో చేరిన ఆమె మంత్రి రోజా ప్రాతినిథ్యం వహిస్తోన్న నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందన్న వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల ఓ వివాహ వేడుకలో తళుక్కుమంది అందాల తార. కొంచెం బొద్దుగా మారారే కానీ అందంలో అప్పటికీ, ఇప్పటికీ ఏ మాత్రం చెక్కు చెదరలేదు. ప్రస్తుతం వాణీ విశ్వనాథ్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..