Ramya Krishna: అందుకే బాలీవుడ్‌లో సినిమాలు చేయలేదు.. ఆసక్తికర విషయం చెప్పిన రమ్యకృష్ణ

|

Sep 18, 2024 | 7:15 AM

ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 1788 కోట్ల కలెక్ట్ చేసి తెలుగు సినిమా స్థాయి పెంచేసింది. ఈ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ అయ్యాడు, అయితే ఈ సినిమా ప్రభాస్ కు ఎంత పేరు వచ్చిందో మరో నటికి కూడా అంతే పేరు వచ్చింది. ఆమె ఎవరో కాదు ఈ సినిమాలో శివగామి దేవిగా నటించిన పేరు రమ్యకృష్ణ.

Ramya Krishna: అందుకే బాలీవుడ్‌లో సినిమాలు చేయలేదు.. ఆసక్తికర విషయం చెప్పిన రమ్యకృష్ణ
Ramya Krishnan
Follow us on

2015 సంవత్సరంలో ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 650 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. అప్పటికి అదే పెద్ద రికార్డ్. ఆ తర్వాత రెండేళ్లకు 2017లో ఈ చిత్రానికి సీక్వెల్‌ ‘బాహుబలి 2’ వచ్చింది. వసూళ్ల పరంగా ఈ సినిమా చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 1788 కోట్ల కలెక్ట్ చేసి తెలుగు సినిమా స్థాయి పెంచేసింది. ఈ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ అయ్యాడు, అయితే ఈ సినిమా ప్రభాస్ కు ఎంత పేరు వచ్చిందో మరో నటికి కూడా అంతే పేరు వచ్చింది. ఆమె ఎవరో కాదు ఈ సినిమాలో శివగామి దేవిగా నటించిన పేరు రమ్యకృష్ణ.

ఈ సినిమా తర్వాత రమ్య క్రేజ్ మరింత పెరిగింది. అప్పటికే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గ రాణించిన ఆమె.. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చింది . కానీ శివగామిగా ఆమె చేసిన పాత్ర ప్రేక్షకులను కట్టిపడేసింది.  ఈ సినిమాతో ఆమెకు మంచి పాపులారిటీ వచ్చింది. అయితే అంతకు ముందు రమ్యకృష్ణ సౌత్‌తో పాటు బాలీవుడ్‌ సినిమాల్లో కూడా నటించింది. అయితే కొంతకాలం తర్వాత హిందీ చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు.

1983లో ‘వెల్లై మనసు’ అనే సినిమా విడుదలైంది. ఈ సినిమాతో రమ్య తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. ఇది తమిళ్ సినిమా. ఆ తర్వాత భలే మిత్రులు సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టింది రమ్యకృష్ణ. ఆ తర్వాత ఆమె మలయాళం, కన్నడ భాషా చిత్రాలలో కూడా కనిపించింది. అలాగే  1988 సంవత్సరంలో రమ్య తన తొలి హిందీ సినిమా చేసింది. 1988లో ఫిరోజ్ ఖాన్, రాజేష్ ఖన్నా, అమ్రిష్ పూరి నటించిన ‘దయావాన్’ అనే చిత్రం విడుదలైంది. ఈ సినిమా ద్వారా రమ్యకృష్ణ బాలీవుడ్‌కి  పరిచయం అయ్యింది. ఇందులో ఆమె డ్యాన్సర్ పాత్రలో కనిపించింది. ఆ తర్వాత ఈ సీనియర్ బ్యూటీ అమితాబ్ బచ్చన్ , గోవిందాల ‘బడే మియాన్ ఛోటే మియాన్’ అలాగే షారుఖ్ ఖాన్ ‘చాహత్’ వంటి అనేక హిందీ చిత్రాలలో నటించింది.  ఆ తర్వాత అనుకోకుండా హిందీకి దూరం అయ్యింది. దీని గురించి గతంలో ఆమె మాట్లాడుతూ.. హిందీ చిత్రసీమలో తన సినిమాలేవీ పెద్దగా ఆడలేదని, అయితే అప్పటికే తాను తెలుగు సినిమాల్లో స్టార్ గా మారిపోయానని అని చెప్పింది. తెలుగు సినిమాని వదిలి బాలీవుడ్‌లో చేసే రిస్క్ తాను తీయను అని అందుకే బాలీవుడ్‌కి దూరంగా ఉంటున్నా అని ఆమె అన్నారు.  ఏ ఇండస్ట్రీలో అయినా సక్సెస్ ఫుల్ సినిమా ఇవ్వడమే ముఖ్యమని, తెలుగులో ఇస్తున్నానని, తెలుగులో హాయిగా ఫీల్ అవుతున్నానని రమ్యకృష్ణ చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.