
పాన్ ఇండియా హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవలే మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ అనే సినిమాలో నటించాడు ప్రభాస్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అంతే కాదు ప్రభాస్ అభిమానులకు దారుణంగా నిరాశపరిచింది. ఈ సినిమా తర్వాత డార్లింగ్ ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా కనిచేస్తున్నాడు సందీప్. ఆ మధ్య స్పిరిట్ నుంచి విడుదల చేసిన ప్రభాస్ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో పాటు సలార్ 2, కల్కి 2, హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు ప్రభాస్.
ఇదిలా ఉంటే ప్రభాస్ చాలా మంది హీరోయిన్స్ తో కలిసి నటించారు. అలాగే ఎంతో మంది నటీనటులతో కలిసి సినిమాలు చేశారు ప్రభాస్. కాగా ప్రభాస్ తో ఓ స్టార్ యాంకర్ కలిసి నటించిందని మీకు తెలుసా.? అది కూడా ప్రభాస్ కు అక్కగా నటించింది ఆ స్టార్ యాంకర్. ఆమె ఎవరో తెలుసా.? చాలా మంది ప్రభాస్ అభిమానులకు ఇప్పటికే అది తెలిసే ఉంటుంది. ఆమె మరెవరో కాదు బుల్లితెరపై తిరుగులేని యాంకర్ గా రాణిస్తున్న సుమ. అవును ప్రభాస్ కు అక్కగా సుమ నటించారు.
ప్రభాస్ నటించిన సినిమాల్లో సూపర్ హిట్ సినిమా వర్షం.. శోభన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో త్రిషను హీరోయిన్ గా నటించింది. కాగా ఈ సినిమాలో ప్రభాస్ అక్కగా స్టార్ యాంకర్ సుమ కనకాల నటించారు. ఆ సినిమాలో ఆమె కనిపించేది కొంతసేపు అయినా తన నటనతో ఆకట్టుకున్నారు సుమ. యాంకర్ గా రాణిస్తున్న సుమ. గతంలో కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. పలు ఇంటర్వ్యూల్లో సుమ ఈ విషయాన్ని పంచుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.