రాత్రంతా స్పెషల్ సాంగ్ షూట్.. తెల్లారే పెళ్లి..! ఈ హీరోయిన్ డెడికేషన్‌కి సలాం అనాల్సిందే

హీరోయిన్స్ సినిమాల కోసం ఎంత కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది హీరోయిన్స్ చిన్న చిన్న పాత్రలకే పరిమితం అవుతుంటే మరికొంతమంది మాత్రం హీరోలకు సమానంగా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. కేవలం గ్లామర్ పరంగానే కాదు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ సినిమాలు చేసి అలరిస్తున్నారు. అలాగే కొంతమంది హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. హీరోయిన్స్ గా బిజీగా ఉంటూనే ఛాన్స్ దొరికినప్పుడల్లా స్పెషల్ సాంగ్స్ లో నటిస్తూ అలరిస్తున్నారు.

రాత్రంతా స్పెషల్ సాంగ్ షూట్.. తెల్లారే పెళ్లి..! ఈ హీరోయిన్ డెడికేషన్‌కి సలాం అనాల్సిందే
Actress

Updated on: Oct 24, 2026 | 1:25 PM

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది టాలెంటడ్ హీరోయిన్స్ ఉన్నారు. సినిమాలకోసం హీరోయిన్స్ చాలా కష్టపడుతూ ఉంటారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల కోసం హీరోయిన్ తెగ కష్టపడుతుంటారు. ప్రస్తుతం హీరోయిన్స్ చాలా మంది హీరోలకు సమానంగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. రెమ్యునరేషన్ విషయంలోనూ ఎక్కడా తగ్గడం లేదు. హీరోయిన్ చాలా మంది స్పెషల్ సాంగ్స్ లోనూ కనిపించి మెప్పిస్తున్నారు. అయితే ఇప్పుడు మాత్రమే కాదు గతంలోనూ చాలా మంది హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్‌తో ఆకట్టుకున్నారు.  అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ చాలా స్పెషల్. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఆమె తోప్ హీరోయిన్. తెలుగులో దాదాపు అందరు హీరోల సరసన నటించి మెప్పించింది ఈ అమ్మడు. హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ కూడా చేసి మెప్పించింది. టాలీవుడ్ లో గ్లామరస్ హీరోయిన్స్ లో ఆమె ఒకరు. ఇంతకు ఆమె ఎవరో తెలుసా.? తెలుగులో తిరుగులేని హీరోయిన్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు రమ్యకృష్ణ.

తెలుగు, తమిళ్ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణించింది రమ్యకృష్ణ. తెలుగు, తమిళ్ భాషల్లో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ. హీరోయిన్ గా రాణించిన రమ్యకృష్ణ ఇప్పుడు సహాయక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంది. బాహుబలి సినిమాతో మరోసారి రమ్యకృష్ణ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇక ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే రమ్యకృష్ణ స్పెషల్ సాంగ్స్ లోనూ అదరగొట్టారు. ఇక బాహుబలి చిత్రంలోని శివగామి పాత్రతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుస చిత్రాలతో బిజీగా ఉన్న రమ్యకృష్ణకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో ట్రెండ్ సృష్టించిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ మూవీ సింహాద్రి సినిమాలో రమ్యకృష్ణ ఓ స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే.  చిన్నది అమ్మో.. చీకులు కావాలా అంటూ సాగే ఈ పాటలో ఆమె తనదైన మాస్ డ్యాన్స్‌తో అప్పట్లో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. అయితే ఈ పాట షూటింగ్ వెనుక ఓ షాకింగ్ విశేషం ఉందట. ఈ విషయాన్ని స్వయంగా రమ్యకృష్ణ గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. “నా పెళ్లికి సరిగ్గా ఒక్క రోజు ముందు కూడా నేను షూటింగ్‌లోనే ఉన్నాను. తెల్లవారితే పెళ్లి అనగా, అంతకుముందు రాత్రి వరకు కూడా ‘సింహాద్రి’ సినిమాలోని స్పెషల్ సాంగ్ షూటింగ్ జరుగుతూనే ఉంది. బిజీ షెడ్యూల్ కారణంగా ఆ పాటను రాత్రి పూట షూట్ చేయాల్సి వచ్చింది. రాత్రి 2 గంటల వరకు షూటింగ్‌లో పాల్గొని, ఆ తర్వాతే నా పెళ్లికి వెళ్లాను”  అని రమ్యకృష్ణ గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం రమ్యకృష్ణ కెరీర్‌కు సంబంధించిన ఈ పాత ఇంటర్వ్యూ క్లిప్ నెట్టింట వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

Ramyakrishna

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us