
కొన్ని సినిమాలు ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతుంటాయి. కథ కథనం, యాక్టర్స్ నటన సినిమా స్థాయిని పెంచేస్తుంటాయి. అలాగే కొన్ని సినిమాలు కమర్షియల్ గా హిట్ అవ్వకపోయిన మంచి సినిమాలుగా ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. వాటిలో అమృత సినిమా ఒకటి. ఇక ఈ సినిమాలో నటించిన హీరో ఆర్ మాధవన్, సిమ్రాన్ తన నటనతో విశేషంగా ఆకట్టుకున్నారు. అలాగే ఈ సినిమాలో ఓ చిన్నారి తన నటనతో ఆడియన్స్ ను అలరించింది. ఆ చిన్నారి పేరు కీర్తన. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన సూపర్ హిట్ చిత్రాల్లో అమృత ఒకటి. 2002లో విడుదలైన ఈ ఫీల్ గుడ్ సినిమా అందరిని ఆకట్టుకుంది. అప్పట్లో ఈ సినిమాకు ఎన్నో అవార్డులు, ప్రశంసలు వచ్చాయి. ఈసినిమా కథ మొత్తం ఓ చిన్నారి చుట్టూ తిరుగుతుంది. తనే కీర్తన.
ఈ మూవీతోనే ఒక్కసారిగా పాపులర్ అయ్యింది ఆ చిన్నారి. అయితే ఆ తర్వాత ఈ చిన్నారి పెద్దగా సినిమాలలో కనిపించలేదు. దాంతో ఆమె గురించి తెలుసుకోవడానికి ఆడియన్స్ ప్రయత్నించారు. కీర్తన మరెవరో కాదు.. తమిళ్ డైరెక్టర్ పార్తీబన్, నటి సీతల కుమార్తె. నటి సీత తెలుగులో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. కెరీర్ ప్రారంభంలో అనేక సినిమాల్లో కనిపించిన ఆమె.. ఆ తర్వాత సహయ నటిగా కనిపించింది. తల్లిదండ్రులు ఇద్దరు నటీనటులు కావడంతో చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆతర్వాత పార్తీబన్, సీత విడిపోయారు. అమృత సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైంది కీర్తన.
ఇక అమృత సినిమాలో తన తల్లిదండ్రులను కలుసుకోవాలనే ఓ చిన్నారి పడే ఆరాటం, పోరాటం ఆధారంగా ఈ మూవీని తెరెక్కించారు. సినిమాలో మనసుకు హత్తుకునే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఆ చిన్నారి తన నటనతో కట్టిపడేసింది. ఈ సినిమాతో ఎన్నో అవార్డ్స్ అందుకున్న కీర్తన.. ఆ తర్వాత కథానాయికగా వెండితెరపై సందడి చేస్తుందని అనుకున్నారు. కానీ అలా కాకుండా అమృత సినిమా తర్వాత మరోసినిమా చేయలేదు. చదువుల కోసం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న కీర్తన.. పెళ్లిచేసుకుని ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఇండస్ట్రీలో ఫేమస్ డైరెక్టర్. కీర్తన అక్కినేని వారింటి పెద్ద కోడలు. కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ అక్కినేని. ఇక కీర్తన భర్త అక్షయ్ అక్కినేని హిందీలో పలు చిత్రాలను తెరకెక్కించారు. ఈ చిన్నారికి సంబందించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.