వార్నీ..! పంజా సినిమా హీరోయిన్ ఎంత మారిపోయింది..!! ఇప్పుడు ఎలా ఉందో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఖాళీ దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. రాజకీయాల్లోకి దిగిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులు ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.

వార్నీ..! పంజా సినిమా హీరోయిన్ ఎంత మారిపోయింది..!! ఇప్పుడు ఎలా ఉందో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే
Panja

Updated on: Jul 07, 2026 | 10:44 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పవన్ సినిమాలకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలతో ఇటు సినిమాలతో బిజీగా ఉన్నాడు పవన్. ఇక పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా సరే పవన్ కళ్యాణ్ ను బిగ్ స్క్రీన్ మీద చూడటానికి ఆడియన్స్, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎగబడతారు. దేశ వ్యాప్తంగా పవన్ కు అభిమానులు ఉన్నారు. హరిహరవీరమల్లు సినిమాతో పవన్ పాన్ ఇండియా స్టార్ గానూ మారిపోయారు. ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు పవర్ స్టార్. అలాగే పవన్ వరుసగా సినిమాలను లైనప్ చేశారు. ఇటీవలే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్. త్వరలోనే ఓజీ 2 సినిమాతో రానున్నారు పవర్ స్టార్.

ఇది కూడా చదవండి : OTT Movie : పెద్దికి పోటీగా ఓటీటీలోకి క్రేజీ మూవీ.. రిలీజ్ అయిన 5 వారాల్లోనే స్ట్రీమింగ్ రెడీ..

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో ఫ్యాన్స్ లో ఉత్సహాన్ని పెంచేసిన సినిమాల్లో పంజా సినిమా ఒకటి. త్వరలోనే ఈ సినిమా రీ రిలీజ్ కానుంది. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పంజా సినిమా రీ రిలీజ్ కానుంది. 2011లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి రివ్యూస్ అందుకుంది. ఈ సినిమాలో పవన్ నటనతో ఆయన లుక్స్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయి. అలాగే యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్స్ గుర్తున్నారా.?

ఇది కూడా చదవండి : అతను ఓ సైకో.. నన్ను సిగరెట్‌తో కాల్చాడు, పిచ్చి పిచ్చిగా కొట్టాడు.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్

వారిలో ఓ ముద్దుగుమ్మ పేరు సారా జేన్ డయాస్. పంజా సినిమాతోనే ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. పంజా సినిమాలో తన క్యూట్ నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది సారా. అలాగే సారా జేన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. కానీ పంజా మూవీ తర్వాత సారా తెలుగులో మరిన్ని సినిమాలు చేయలేదు. ఒమన్ దేశానికి చెందిన బ్యూటీ ఈ అమ్మడు. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చింది సారా జేన్ డయాస్. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ షాకింగ్ లుక్ లోకి మారిపోయింది. కొన్ని రోజులుగా సినిమాల్లో కనిపించని సారా.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లకు దగ్గరగా ఉంటుంది. తాజాగా సారా జేన్ డయాస్ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : పెళ్లి రోజున సర్‌ప్రైజ్ అని విడాకులు ఇచ్చాడు.. కన్నీళ్లు పెట్టుకున్న టాలీవుడ్ హీరోయిన్

Sarah Jane Dias

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us