అబ్బా.. ఎంత క్యూట్‌గా ఉందో..!! ఇరుముడి సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతమవుతోన్న మాస్ మహారాజా రవితేజకు ఇరుముడి రూపంలో బిగ్ రిలీఫ్ లభించింది. గత శుక్రవారం (ఆగస్టు 21) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ డివోషనల్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టుతోంది .

అబ్బా.. ఎంత క్యూట్‌గా ఉందో..!! ఇరుముడి సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా.?
Actress

Updated on: Aug 24, 2026 | 10:29 AM

మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ ఇరుముడి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ ఫ్యాన్స్‌కు ఇరుముడితో భారీ హిట్ అందించారు రవితేజ. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గా థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకులను అలరిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించింది. టీజర్స్, సాంగ్స్, ట్రైలర్ తోనే పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసిన ఇరుముడి సినిమా గత శుక్రవారం(ఆగస్టు 21) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

అసలు ఆ సినిమా చేయాలనుకోలేదు.. అనుకోకుండా చేశాం..! పెద్ద హిట్ అయ్యింది

ప్రజెంట్ సినిమా ట్రెండ్ అయిన సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీకి డివోషనల్ టచ్ ఇచ్చి ఈ సినిమాను తెరకెక్కించాడు శివ నిర్వాణ. ఈ సినిమాకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది. ఈ సినిమాలోని తండ్రి, కూతురు మధ్య చూపించిన బాండింగ్ ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో రవితేజ తన నటీనతో మరోసారి కట్టిపడేశారు. అలాగే రవితేజ కూతురిగా నటించిన బేబీ నక్షత్ర కూడా తన నటనతో ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాలో మరో చిన్నది అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.

మహేష్ బాబుకు అమ్మగా నటించాలని ఉంది.. ఆ ఛాన్స్ ఎప్పుడొస్తుందో.!

పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని గుర్తుపట్టారా.? ఆమె పేరు సామ్ (గాయత్రి). పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు  చేసింది. కానీ ఆమె ఎక్కువ శాతం గుర్తింపు లేని పాత్రల్లో నటించింది. తాజాగా ఇరుముడి సినిమాలో ఈ చిన్నది తన నటనతో ఆకట్టుకుంది. దాంతో నెటిజన్స్, ఆడియన్స్ ఈ ముద్దుగుమ్మ ఎవరు.? అంటూ గూగుల్ లో గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె సోషల్ మీడియా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ చిన్నదాని క్యూట్ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

చూడటానికి అలా ఉంటుంది కానీ.. ఆమెకు పొగరెక్కువ..! సాయి పల్లవి నిజస్వరూపం ఇదే అంటున్న యంగ్ హీరో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us