లెక్కల మాస్టర్ లవ్ స్టోరీ మామూలుగా లేదుగా.. ఫ్యాన్‌ను ప్రేమించి పెళ్లాడిన సుకుమార్

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఇప్పుడు పాన్ ఇండియన్ డైరెక్టర్ గా మారారు. వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్ లు అందుకుంటున్నారు. పుష్ప , పుష్ప 2 సినిమాలతో సంచలన విజయాలను అందుకున్నారు సుకుమార్. ఇక ఇప్పుడు సుకుమార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నారు.

లెక్కల మాస్టర్ లవ్ స్టోరీ మామూలుగా లేదుగా.. ఫ్యాన్‌ను ప్రేమించి పెళ్లాడిన సుకుమార్
Sukumar

Updated on: Aug 24, 2026 | 4:29 PM

సినిమాకు నిర్మాత డబ్బులు పెడతారు. నటులు అద్భుతంగా నటిస్తారు. సంగీత దర్శకులు మధురమైన ట్యూన్‌లు కంపోజ్ చేస్తారు. మరి దర్శకుడు చేసేది ఏమిటి.? ఇదే ప్రశ్న ఒక అందమైన ప్రేమకథకు నాంది పలికింది. ఆ ప్రేమకథ నాలుగేళ్ల నిరీక్షణ, పోరాటం తర్వాత పెళ్లి పీటలెక్కి, ఒక ఆనందకరమైన కుటుంబంగా మారింది. ఈ ప్రేమజంట మరెవరో కాదు, టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ దర్శకుడు, మన లెక్కల మాస్టర్ సుకుమార్, ఆయన ప్రియమైన భార్య తబిత హంసిని. సుకుమార్ అంటేనే పర్ఫెక్షన్. పుష్ప, ఆర్య, జగడం, 100 పర్సెంట్ లవ్, వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం వంటి ఆయన సినిమాలను చూస్తే, కథను ఎంత బలంగా చెబుతారో, అంతే అందంగా హీరో, హీరోయిన్ల మధ్య బలమైన ప్రేమ బంధాన్ని కూడా చూపిస్తారు. ఆర్యలో  ట్రైయాంగిల్ ప్రేమకథను, నాన్నకు ప్రేమతోలో విచిత్రమైన ప్రేమకథను, రంగస్థలంలో ప్యూర్ ఇన్నోసెంట్ లవ్‌ను, పుష్పలో కసితో కూడిన ప్రేమను చూపించి, ప్రేమకథల విషయంలో తనకి తానే పోటీ అని నిరూపించుకున్నారు. సుకుమార్ ఇంత అందంగా ప్రేమకథలు తీయడానికి కారణం ఆయన జీవితంలో అంతకంటే అందమైన ప్రేమకథ ఉండటమే అయ్యుండొచ్చు.

అసలు ఆ సినిమా చేయాలనుకోలేదు.. అనుకోకుండా చేశాం..! పెద్ద హిట్ అయ్యింది

సుకుమార్, తబిత హంసినిల ప్రణయగాథ హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సుదర్శన్ థియేటర్‌లో మొదలైంది. ఆర్య సినిమా స్క్రీనింగ్ సమయంలో సుకుమార్ మొదటిసారి తబితను చూశారు. అక్కడి నుంచే వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. సుకుమార్ ధైర్యం చేసి తన ఫోన్ నెంబర్ ఇచ్చి, తరచుగా ఆమెతో మాట్లాడేవారు. అయితే, ఇక్కడ ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. వారు ప్రేమ గురించి కాదు, సినిమా డైరెక్షన్ గురించి మాట్లాడుకునేవారు. “సినిమా ప్రొడ్యూసర్ డబ్బులు పెడతారు, నటులు నటిస్తారు, మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్స్ కంపోజ్ చేస్తారు, మరి డైరెక్టర్ ఏం చేస్తారు?” అని తబిత తరచుగా సుకుమార్‌ను అడిగేవారట. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికే సుకుమార్ ఆమెకు తన నెంబర్ ఇచ్చి, ఫోన్‌లు చేసి రకరకాల సమాధానాలు చెప్పి ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించేవారట. కానీ తబిత మాత్రం అంత సులువుగా ఒప్పుకునే వారు కాదట. ఈ జర్నీలోనే సుకుమార్ తబిత ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

మహేష్ బాబుకు అమ్మగా నటించాలని ఉంది.. ఆ ఛాన్స్ ఎప్పుడొస్తుందో.!

సుకుమార్ తన ప్రేమను వ్యక్తపరచగా, తబిత కూడా అంగీకరించారట. అయితే, తెలుగు సినిమాల్లో చూపించే టిపికల్ తల్లిదండ్రుల మాదిరిగానే, తబిత తల్లిదండ్రులు కూడా ఈ పెళ్ళికి అంగీకరించలేదు. సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వ్యక్తికి తమ కూతురిని ఇవ్వలేమని తేల్చి చెప్పారట. తల్లిదండ్రులను ఒప్పించడానికి సుకుమార్, తబిత దాదాపు నాలుగేళ్లపాటు కష్టపడి పోరాడారు. ఈ మధ్యలో తబితను సుకుమార్‌కు దూరంగా ఉంచడానికి ఆమె తల్లిదండ్రులు ప్రయత్నించినా, ఆమె మాత్రం సుకుమార్‌కు బలంగా మద్దతు ఇచ్చారు. మరో విశేషం ఏమిటంటే, తబిత తల్లిదండ్రులు ఇంత సంప్రదాయబద్ధంగా ఆలోచిస్తే, సుకుమార్ తల్లిదండ్రులు మాత్రం చాలా ఉదారంగా తబితను కోడలిగా చేసుకోవడానికి ఒక్క మాటలో ఒప్పుకున్నారట. చివరికి, నాలుగేళ్ల పోరాటం తర్వాత తబిత తల్లిదండ్రులను కూడా ఒప్పించి, 2009లో సుకుమార్, తబిత పెళ్లి చేసుకున్నారు. వీరికి సుకృతి అనే అమ్మాయి, సుక్రాంత్ అనే అబ్బాయి ఉన్నారు.

ఇవి కూడా చదవండి

చూడటానికి అలా ఉంటుంది కానీ.. ఆమెకు పొగరెక్కువ..! సాయి పల్లవి నిజస్వరూపం ఇదే అంటున్న యంగ్ హీరో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Loading...
Unable to load recommendations.
Follow Us