దేవుడా.. ఒకప్పటి కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఆసిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

హీరోయిన్స్ గా రాణించిన భామలు పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పుతున్నారు. అలా సినిమాలకు దూరం అయిన అందాల భామల్లో ఆసిన్ ఒకరు. తమిళ్, తెలుగు, హిందీ సినిమాల్లో నటించిన ఆసిన్ దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టింది. అప్పటి కుర్రకారంతా ఆసిన్ ఫోటోలను పదిలంగా దాచుకునేవారు.. ఎక్కడ చూసిన ఆమె ఫొటోలే కనిపించేవి.

దేవుడా.. ఒకప్పటి కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఆసిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
Asin
Follow us

|

Updated on: Jun 21, 2024 | 9:04 PM

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్ గా ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మల్లో ఇప్పుడు చాలా మంది సినిమాలకు దూరం గా ఉంటున్నారు. హీరోయిన్స్ గా రాణించిన భామలు పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పుతున్నారు. అలా సినిమాలకు దూరం అయిన అందాల భామల్లో ఆసిన్ ఒకరు. తమిళ్, తెలుగు, హిందీ సినిమాల్లో నటించిన ఆసిన్ దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టింది. అప్పటి కుర్రకారంతా ఆసిన్ ఫోటోలను పదిలంగా దాచుకునేవారు.. ఎక్కడ చూసిన ఆమె ఫొటోలే కనిపించేవి. అంతలా కుర్రాళ్ల మనసులు దోచేసింది ఈ వయ్యారి భామ. ఇక సూర్య నటించిన గజినీ, రవితేజ నటించిన అమ్మానాన్న ఓ తమిళ్ అమ్మాయి లాంటి సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయింది.

గజినీ సినిమానే బాలీవుడ్ లో రీమేక్ చేయగా అందులోనూ ఆసిన్ హీరోయిన్ గా చేసింది. ఆసిన్ క్లాసికల్ డాన్సర్ అని చాలా మందికి తెలియక పోవచ్చు. అంతే కాదు ఈ అమ్మడు ఏకంగా ఎనిమిది భాషల్లో మాట్లాడగలదు. తన సినిమాలకు తానే డబ్బింగ్ కూడా చెప్పుకునేది ఈ చిన్నది. అందాల ఆసిన్ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. వివాహం తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.

ఆసిన్ ఎప్పటికప్పుడు తనతోపాటు.. తన ఫ్యామిలీ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా, సోషల్ మీడియాలో ఆసిన్ కు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఇప్పుడు కూడా అలానే ఉందంటూ పేర్కొంటున్నారు నెటిజన్లు. పెళ్లి అనంతరం సినిమాలకు పూర్తిగా దూరమైన ఆసిన్.. సోషల్ మీడియాలో తన ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ అమ్మడి ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

ఆసిన్ లేటెస్ట్ ఇన్ స్టా పోస్ట్..

ఆసిన్ లేటెస్ట్ ఇన్ స్టా పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles