27 June 2024

బాపుగారి బొమ్మలా ఉండే అమ్మాయి ఇలా తయారయ్యిందేంటీ..

Rajitha Chanti

Pic credit - Instagram

హీరోయిన్ ప్రణిత సుభాష్ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. బావ సినిమాతో కథానాయికగా పరిచయమైంది.

అందం, అభినయంతో మెప్పించినా ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. కానీ తన ప్రత్యేకమైన స్టైల్‏తో ప్రేక్షకులను మెప్పించింది ఈ బ్యూటీ.

హీరోయిన్‏గా పలు చిత్రాల్లో నటించిన ప్రణిత  పెద్ద హీరోల సినిమాల్లో సెకండ్ హీరోయిన్‏గా ఛాన్స్ అందుకుని తన నటనతో అలరించింది ఈ వయ్యారి. 

అత్తారింటికి దారేది సినిమాతో మెప్పించిన ప్రణిత ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఇప్పుడిప్పుడే బుల్లితెరపై తిరిగి సందడి చేస్తుంది. 

పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ప్రణిత.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‏గా ఉంటూ ప్రతి రోజూ కొత్త ఫోటోస్ షేర్ చేస్తుంది. 

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన గ్లామర్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. తల్లి అయినా ఏమాత్రం గ్లామర్ డోస్ తగ్గలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇప్పుడు ప్రణిత సుభాష్ షేర్ చేసిన ఫోటోస్ చూసి కుర్రాళ్లు షాకవుతున్నారు. స్విమ్మింగ్ ఫూల్లో సరదాగా ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.

స్టైలీష్, గ్లామర్ గా ప్రణిత ఈ ఫోటోలలో కనిపించింది. తక్కువ మేకప్ ఉన్నా కూడా మరింత అందంగా కనిపిస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది ప్రణీత.