27 June 2024

డైరెక్టర్ నాగ్ అశ్విన్ లవ్ స్టోరీ గురించి తెలుసా..? 

Rajitha Chanti

Pic credit - Instagram

డైరెక్టర్ నాగ్ అశ్విన్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఆయన తెరకెక్కించిన కల్కి ప్రాజెక్ట్ నేడు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీలో బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ నటీనటులు కీలకపాత్రలు పోషించారు. 

నాగ్ అశ్విన్ తల్లిదండ్రులు ఇద్దరు వైద్యులే. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న నాగ్ అశ్విన్ అశ్విన్ జర్నలిజంలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 

కెరీర్ ప్రారంభంలో శేఖర్ కమ్ముల వద్ద అసిస్టెండ్ డైరెక్టర్‏గా పనిచేశారు. ఆ తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు.

సినిమాల కంటే ముందు పలు యాడ్స్ కోసం పనిచేశాడు నాగ్ అశ్విన్. ఆ సమయంలోనే ప్రముఖ నిర్మాత ప్రియాంక దత్‏తో పరిచయం ఏర్పడింది. 

ఎవడే సుబ్రమణ్యం సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా.. ప్రియాంక దత్ నిర్మాతగా వ్యవహరించారు. ఆ సమయంలో వీరిద్దరు ఫ్రెండ్స్. 

ఆ తర్వాత వీరిద్దరి స్నేహం ప్రేమగా మారింది. ప్రియంక దత్‏కు ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్నారని తెలిసి వెంటనే నాగ్ అశ్విన్ ప్రపోజ్ చేశారట. 

మీకు ఎవరైనా నచ్చితే సరే.. లేదంటే మనం పెళ్లి చేసుకుందాం అన్నారట. అందుకు ప్రియాంక ఓకే చెప్పడంతో వీరి పెళ్లి 2015లో జరిగింది.