Tollywood: ఇండస్ట్రీలోనే రిచెస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా ?.. హయ్యేస్ట్ రెమ్యునరేషన్ సైతం ఆమెకే.. ఎన్ని కోట్లంటే..

|

Feb 22, 2024 | 9:45 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలో హయ్యేస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న ముగ్గురు తారల గురించి తెలుసుకోవాల్సిందే. అవును ఇండస్ట్రీని శాసిస్తున్న ఎలైట్ త్రయంలో దీపికా పదుకొనే, కత్రినా కైఫ్, అనుష్క శర్మ ఉన్నారు. వీరు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో అపారమైన కీర్తిని పొందడమే కాకుండా భారీగా ఆస్తులు సంపాదించారు. భారతదేశంలో అత్యంత ధనిక ప్రముఖుల జాబితాలో గౌరవనీయమైన స్థానాలను సంపాదించుకున్నారు. మరీ వీరి ముగ్గురిలో రిచెస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసుకుందామా.

Tollywood: ఇండస్ట్రీలోనే రిచెస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా ?.. హయ్యేస్ట్ రెమ్యునరేషన్ సైతం ఆమెకే.. ఎన్ని కోట్లంటే..
Deepika, Anushka Sharma, Ka
Follow us on

ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్స్ పాత్రలకు సైతం మంచి గుర్తింపు వస్తుంది. ఇప్పుడు కథానాయకలుగా కూడా హీరోలకు సమానంగా పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో కొందరు తారలు తమ సత్తా చాటుతున్నారు. ఏమాత్రం తగ్గేదే లే అంటూ హీరోలతో సమానంగా దూసుకుపోతున్నారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో హయ్యేస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న ముగ్గురు తారల గురించి తెలుసుకోవాల్సిందే. అవును ఇండస్ట్రీని శాసిస్తున్న ఎలైట్ త్రయంలో దీపికా పదుకొనే, కత్రినా కైఫ్, అనుష్క శర్మ ఉన్నారు. వీరు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో అపారమైన కీర్తిని పొందడమే కాకుండా భారీగా ఆస్తులు సంపాదించారు. భారతదేశంలో అత్యంత ధనిక ప్రముఖుల జాబితాలో గౌరవనీయమైన స్థానాలను సంపాదించుకున్నారు. మరీ వీరి ముగ్గురిలో రిచెస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసుకుందామా.

దీపికా పదుకోణె..

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు. 2007లో ‘ఓం శాంతి ఓం’తో బాలీవుడ్‌లో దీపికా ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత ఆమె పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటీమణుల్లో ఒకరిగా మారింది. సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన పద్మావత్ సినిమాకు రూ. 13 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంది. అప్పటివరకు రూ. 10 కోట్లు అందుకున్న హీరోయిన్లను దాటేసింది. ఈ మైలురాయిని సాధించిన మొదటి భారతీయ నటిగా రికార్డ్ సృష్టించింది. పద్మావత్, బాజీరావ్ మస్తానీ, జవాన్, చెన్నై ఎక్స్‌ప్రెస్ వంటి భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌లలో కనిపించింది. దీపికా పదుకొణె నికర విలువ సుమారుగా రూ. 500 కోట్లు. ఒక్కో సినిమాకు రూ. 10 నుంచి 15 కోట్లు తీసుకుంటుంది. అలాగే సొంతంగా చర్మ సంరక్షణ బ్రాండ్ 82°E,ప్రొడక్షన్ హౌస్ కలిగి ఉంది. తనిష్క్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, లూయిస్ విట్టన్, కార్టియర్ వంటి బ్రాండ్‌లను అంబాసిడర్.

అనుష్క శర్మ..

2008లో షారుఖ్ ఖాన్‌తో కలిసి రబ్ నే బనా ది జోడి సినిమాతో నటిగా అరంగేట్రం చేసింది. తక్కువ సమయంలోనే జబ్ తక్ హై జాన్, ఏ దిల్ హై ముష్కిల్, సుల్తాన్, సంజు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అనుష్క శర్మ నికర విలువ సుమారుగా రూ. 300 కోట్లు. ఆమె ఒక్కో సినిమాకు 12-13 కోట్లు. నిర్మాణ సంస్థ క్లీన్ స్లేట్ ఫిల్మ్స్‌ను సహ-స్థాపన చేసింది. “NH10,” “పాతాల్ లోక్,” “బుల్బుల్” వంటి విజయవంతమైన ప్రాజెక్ట్‌లను చేసింది. ఒక్కో ఎండార్స్‌మెంట్‌కు 4 కోట్లు. ఫోర్బ్స్ ఆమెను 2019లో అత్యధికంగా చెల్లించే 21వ సెలబ్రిటీగా మారింది. దీని సంపాదన రూ. 28.67 కోట్లు.

కత్రినా కైఫ్..

2003లో బూమ్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె ఫిల్మోగ్రఫీలో మైనే ప్యార్ క్యున్ కియా?, నమస్తే లండన్, రాజనీతి, జిందగీ నా మిలేగీ దొబారా, బ్యాంగ్ బ్యాంగ్!, టైగర్ జిందా హై, జీరో చిత్రాల్లో నటించింది. బాలీవుడ్‌లో అత్యంత బిజీ నటీమణులలో ఒకరిగా మారింది. కత్రినా నికర విలువ రూ. 235 కోట్లు. ఒక్కో సినిమాకు 10 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. భారతదేశంలోని టాప్ సెలబ్రిటీ ఎండోర్సర్ కూడా. ఒక ఎండార్స్‌మెంట్ డీల్‌కు రూ. 6 నుండి 7 కోట్లకు పైగా వసూలు చేస్తూ, ఆమె తన బ్రాండ్ అసోసియేషన్‌లకు భారీ రెమ్యునరేషన్ అందుకుంటుంది.