Ram Charan: రామ్ చరణ్ బర్త్ డేకు వేసుకున్న షర్ట్ ధర తెలిస్తే బిత్తరపోతారు.. నెట్టింట వైరలవుతున్న ఫోటోస్..

|

Mar 28, 2023 | 1:33 PM

చెర్రీకి సంబంధించిన త్రోబ్యాక్ ఫోటోస్.. లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట షేర్ చేస్తూ.. తమ సంతోషాన్ని తెలియజేశారు. ఇక నైట్ పార్టీలో విజయ్ దేవరకొండ, ఎస్ఎస్ రాజమౌళి, ఎంఎం కీరవాణి, కాజల్ దంపతులు, దర్శకనిర్మాతలు, ప్రశాంత్ నీల్ తదితరులు పాల్గోన్నారు.

Ram Charan: రామ్ చరణ్ బర్త్ డేకు వేసుకున్న షర్ట్ ధర తెలిస్తే బిత్తరపోతారు.. నెట్టింట వైరలవుతున్న ఫోటోస్..
Ram Charan Birthday Shirt
Follow us on

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు హైదరాబాద్‏లో గ్రాండ్‏గా జరిగాయి. ఈ సెలబ్రెషన్స్‏కు టాలీవుడ్ సినీ ప్రముఖులు.. దర్శకనిర్మాతలు.. నటీనటులు పాల్గోని సందడి చేశారు. ఇక వారం రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో సెలబ్రెషన్స్‏తో రచ్చ చేశారు మెగా అభిమానులు. చెర్రీకి సంబంధించిన త్రోబ్యాక్ ఫోటోస్.. లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట షేర్ చేస్తూ.. తమ సంతోషాన్ని తెలియజేశారు. ఇక నైట్ పార్టీలో విజయ్ దేవరకొండ, ఎస్ఎస్ రాజమౌళి, ఎంఎం కీరవాణి, కాజల్ దంపతులు, దర్శకనిర్మాతలు, ప్రశాంత్ నీల్ తదితరులు పాల్గోన్నారు. అయితే బర్త్ డే రోజున ఉదయం నుంచే తన ఇంటికి వచ్చిన అభిమానులను కలుసుకున్నారు చరణ్. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే ఇందులో అందరి దృష్టి చరణ్ వేసుకున్న షర్ట్ పై పడింది.

చరణ్ వేసుకున్న షర్ట్ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఆ షర్ట్ బ్రాండ్ ఏంటీ ?.. ధర ఎంత ? అని తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. లైట్ బ్లూ కలర్‏లో ప్యాచ్ వర్క్‏తో ఉన్న షర్ట్ గురించి గూగుల్ లో సెర్చ్ చేయగా.. ఫార్ ఫెచ్ అనే షాపింగ్ వెబ్‏సైట్ లో కనిపించింది. జున్యా వటనాబి ప్యాచ్ వర్క్ డీటైల్ షర్ట్ పేరుతో అందుబాటులో ఉన్న ఈ షర్ట్ ధర $983 డాలర్లు. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.80843.38 అన్నమాట. ఇక ఈ ప్రైజ్ చూసి అభిమానులు షాకవుతున్నారు. చరణ్ షర్ట్ ధరపై విభిన్నంగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం చరణ్..పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. నిన్న చెర్రీ బర్త్ సందర్బంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.