తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్.. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు సంపాదించుకున్నాడు. సౌత్ ఇండస్ట్రీలో పలు సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన ఈ డైరెక్టర్.. ఇప్పుడు బాలీవుడ్ లో సత్తా చాటుతున్నాడు. బీటౌన్ బాద్ షా షారుఖ్ ఖాన్ సినీప్రయాణంలో అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు. చాలా కాలం తర్వాత షారుఖ్ కు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు అట్లీ. జవాన్ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆయన సృష్టించిన సంచలనం గురించి చెప్పక్కర్లేదు. ఈ సినిమా దాదాపు రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్స్ సృష్టించింది. దీంతో ఇప్పుడు అట్లీతో సినిమాలు చేసేందుకు నార్త్ స్టార్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. దర్శకుడిగానే కాకుండా నిర్మాతగానూ మారాడు అట్లీ. ప్రస్తుతం ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్న బేబీ జాన్ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది.
దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. ఇందులో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో చిత్రయూనిట్ తో కలిసి పాల్గొన్నారు అట్లీ. అయితే ఈ షోలో అట్లీ లుక్స్ అవమానిస్తూ మాట్లాడాడు కపిల్. “మీరు కథ చెప్పడానికి ఏ స్టార్ దగ్గరికి అయినా వెళ్లినప్పుడు.. మిమ్మల్ని చూసి డైరెక్టర్ ఎవరు అని అడుగుతారా ” అంటూ అవమానించేలా మాట్లాడాడు కపిల్. దీంతో ఆయన ఉద్దేశ్యాన్ని గమనించిన అట్లీ తనదైన స్టైల్లో కౌంటరిచ్చాడు.
“ఒక విధంగా మీ ప్రశ్న నాకు అర్థమైంది. నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. నా మొదటి సినిమా నిర్మించిన ఏఆర్ మురుగదాస్ సర్ కు నేను కృతజ్ఞతలు చెప్పాలి. అతడు నా స్క్రిప్ట్ చూశాడు. నేను ఎలా ఉన్నాను.. నాలో సామర్థ్యం ఉందా లేదా అనేది చూడలేదు. కానీ ఆయనకు నేను చెప్పిన స్టోరీ నచ్చింది. ప్రపంచం మనలో ఉన్న టాలెంట్ చూడాలి. మనం ఎలా ఉన్నది కాదు. రూపాన్ని బట్టి మనిషిని కాదు” అంటూ కపిల్ శర్మకు గట్టిగానే కౌంటరిచ్చాడు అట్లీ. దీంతో ఇప్పుడు కపిల్ శర్మ తీరుపై నెట్టింట తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‌బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..
Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‌గా..
Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‌ను మించిన అందం.. ఎవరంటే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.