ఇది కదా ప్రభాస్ ఫ్యాన్స్ కు కావాల్సింది. సలార్ సినిమా టీజర్ వచ్చేసింది. కేజీఎఫ్ లాంటి సినిమాతో సంచలన విజయం అందుకున్న విషయం తెలిసిందే. కేజీఎఫ్ సినిమా రెండు పార్ట్స్ గా వచ్చిన విషయం తెలిసిందే. ఇక కేజీఎఫ్ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా సలార్. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. జులై 6న ఉదయం 5.12 గంటలకు సలార్ టీజర్ ను రిలీజ్ చేశారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది ఈ సినిమా. ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఈ టీజర్ చూస్తుంటే మూవీ కూడా కేజీఎఫ్ ఫ్లేవర్ లోనే వస్తుందని అర్ధమవుతోంది.
ఇక ఈ టీజర్ లో వచ్చిన డైలాగ్ మాత్రం అదిరిపోయింది. సింహం, చీతా, ఏనుగు చాలా డేంజర్ కానీ జురాసిక్ పార్క్ లో కాదు.. ఎందుకంటే అక్కడ ఉంది.. అని డైలాగ్ చెప్పగానే రెబల్ స్టార్ ప్రభాస్ అని పేరు వస్తుంది. ఈ ఒక్క డైలాగ్ చాలు సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పడానికి.
సలార్ టీజర్ 1 నిమిషం 46 సెకన్ల నిడివి ఉంది. ఈ టీజర్ లో విలన్ గా నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ను కూడా చూపించారు. అలాగే ప్రభాస్ ను ఎక్కడా క్లియర్ గా చూపించలేదు. ఆయన విలన్స్ ను ఊచకోత కోస్తున్న సన్నివేశాలను చూపించారు. పృథ్వీరాజ్ లుక్ కొచం కేజీఎఫ్‌లోని అధీరాను పోలి ఉంది. అలాగే ప్రభాస్ ఫైట్ చేసిన విలన్స్ కూడా కేజీఎఫ్ లో కనిపించిన వారిలానే ఉన్నారు. కేజీఎఫ్ లో లానే ఓ పెద్దాయన హీరో గురించి ఎలివేషన్ ఇచ్చాడు ఈ టీజర్ లోకూడా.. వీటితో పాటు ఈ సినిమా రెండు పార్ట్ లు రానుందని చివరిలో క్లారిటీ ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ అని టీజర్ చివరిలో వేశారు. ఇలా కేజీఎఫ్ తో చాలా రిలేటెడ్ గా ఉంది ఈ టీజర్. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 28 న రిలీజ్ కాబోతోంది.