Vijay Deverakonda: అవార్డును వేలం వేసిన విజయ్ దేవరకొండ.. ఆ డబ్బును ఏం చేశాడంటే

పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన గీతగోవిందం సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.. ఇక ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అయ్యారు. ఫ్యామిలీ స్టార్ సినిమాలో విజయ్ కు జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. తెలుగులో మృణాల్ కు ఇది మూడో సినిమా..

Vijay Deverakonda: అవార్డును వేలం వేసిన విజయ్ దేవరకొండ.. ఆ డబ్బును ఏం చేశాడంటే
Vijay Devarakonda
Follow us

|

Updated on: Apr 02, 2024 | 12:54 PM

రౌడీ బాయ్‌ విజయ్ దేవరకొండ క్రేజ్ రోజు రోజుకు పెరుగుతోంది. యువతను ఆకట్టుకునే సినిమాలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే సినిమా చేస్తూ దూసుకుపోతున్నారు. ఖుషి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ గా ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అవుతున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన గీతగోవిందం సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.. ఇక ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అయ్యారు. ఫ్యామిలీ స్టార్ సినిమాలో విజయ్ కు జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. తెలుగులో మృణాల్ కు ఇది మూడో సినిమా.. కాగా ఇప్పటికే ఫ్యామిలీ స్టార్ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను మెప్పించాయి.

ఇటీవల ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ గతంలో తన అవార్డును వేలం వేసిన విషయాన్నీ ప్రస్తావించాడు. విజయ్ ను స్టార్ ను చేసిన సినిమా అర్జున్ రెడ్డి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో విజయ్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమాలో విజయ్ నటనకు గాను ఫిల్మ్‌ఫేర్‌లో ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నాడు.

అయితే ఈ అవార్డును 2019లో వేలం వేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడుతూ.. తనకు అవార్డులు అంటే ఇష్టం లేదని.. తనకు వచ్చిన అవార్డ్స్ లో కొన్ని ఆఫీస్ లో ఉంటే మరికొన్ని ఇంట్లో ఉన్నాయని తెలిపాడు. అలాగే తనకు వచ్చిన అవార్డును కూడా వేలం వేశానని తెలిపాడు విజయ్. 2019లో ఫిలిం ఫేర్ అవార్డును 5 లక్షలు వస్తే చాలు అని ఆన్ లైన్ లో వేలం మొదలు పెట్టారు.. కానీ ఆ అవార్డు 25 లక్షలకు శ్యామలా దేవి దక్కించుకున్నారు. ఆ డబ్బును సీఎం సహాయ నిధికి అందించాడు విజయ్. ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ సినిమా విడుదలకానుంది.

Vijay Devarakonda

విజయ్ దేవరకొండ ఇన్ స్టా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు