
పై ఫొటోలో క్యూట్ గా కనిపిస్తోన్న అమ్మాయిని కనిపిస్తున్నారా? ఈ బ్యూటీ ఇప్పుడు సౌతిండియన్ క్రేజీ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళ్ లో సినిమాలు చేసింది. కొన్నింటిలో హీరోయిన్ గా చేస్తే మరికొన్నింటిలో స్పెషల్ రోల్స్ తో సందడి చేసింది. అందం, అభినయం పరంగా మంచి మార్కులే తెచ్చుకుంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. గత కొన్ని రోజులుగా ఈ ముద్దుగుమ్మ పేరు తెగ మార్మోగిపోతోంది. సోషల్ మీడియాలోనూ ఈ సొగసరి గురించే చర్చ. ఎందుకంటే త్వరలోనే ఈ అందాల తార తన బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెప్పనుంది. పెళ్లితో తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది.. హా..ఇందులో కొత్తే ముంది.. అనుకోవచ్చు. ఈ హీరోయిన్ పెళ్లి చాలా స్పెషల్. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ మెడలో ఒక స్టార్ హీరో మూడు ముళ్లు వేయనున్నాడు. గత 15 ఏళ్లుగా వీరిద్దరి మధ్య స్నేహ బంధం ఉందట. అయితే ఈ హీరోయిన్ కష్ట సమయాల్లో ఉన్నప్పుడు హీరో తనకు అండగా నిలబడ్డాడట. దీంతో వీరి స్నేహ బంధం కాస్తా ప్రేమ బంధంగా మారిపోయింది. త్వరలో అది మూడు ముళ్ల బంధంగా మారిపోనుంది.
అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈపాటికే ఈ ప్రేమ పక్షుల పెళ్లి జరిగి ఉండేది. కానీ కొన్ని కారణాలతో అనూహ్యంగా ఈ హీరో, హీరోయిన్ల పెళ్లి వాయిదా పడింది. అయితే తమ వెడ్డింగ్ డేట్ నే ఎంగెజ్ మెంట్ డే గా మార్చుకున్నారు. ఇద్దరూ కలిసి ఉంగరాలు మార్చుకున్నారు. ఇరు పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. ఈ క్యూటీ మరెవరో కాదు విశాల్ కు కాబోయే భార్య సాయి ధన్సిక. ఇది ఆమె టీనేజ్ ఫొటో. విశాల్ తో ఎంగేజ్ మెంట్ నేపథ్యంలో సాయి ధన్సిక చిన్ననాటి ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.