AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ దగ్గర కూలర్ బాయ్‌గా చేశాడు.. ఇప్పుడు ఇతని పేరు టాలీవుడ్‌లో మార్మోగుతోంది

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సత్య సినిమాను చూసే ఇతనుకూడా సినిమా ఇండస్ట్రీలోకి రావాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఆ కలను నిజం చేసుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. కెరీర్ ప్రారంభంలో తనకు స్ఫూర్తి నిచ్చిన ఆర్జీవీ దగ్గరే కూలర్ బాయ్ గా కూడా పని చేశాడు. ఇప్పుడితని పేరు టాలీవుడ్ లో తెగ మార్మోగుతోంది.

Tollywood: ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ దగ్గర కూలర్ బాయ్‌గా చేశాడు.. ఇప్పుడు ఇతని పేరు టాలీవుడ్‌లో మార్మోగుతోంది
Tollywood Director
Basha Shek
|

Updated on: Aug 23, 2026 | 2:11 PM

Share

భారతీయ సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ శిష్యులు చాలా మంది ఉన్నారు. తేజ, కృష్ణవంశీ, పూరి జగన్నాథ్, గుణశేఖర్, శివ నాగేశ్వరరావు, నివాస్.. ఇలా ఎంతో మంది ట్యాలెంటెడ్ డైరెక్టర్లు ఆర్జీవీ దగ్గర ఓనమాలు నేర్చుకున్నవారే. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వ్యక్తికి కూడా రామ్ గోపాల్ వర్మ అంటే చాలా ఇష్టం. ఆయనను చూసే సినిమా ఇండస్ట్రీలోకి రావాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. తన ట్యాలెంట్, హార్డ్ వర్క్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. కెరీర్ ప్రారంభంలో తనకు ఎంతగానో స్ఫూర్తి నిచ్చిన ఆర్జీవీ దగ్గరే కూలర్ బాయ్ గా పని చేశాడు. అయితే ఇక్కడే ఓ అసలైన ట్విస్ట్ ఉంది.. అదేంటంటే ఆర్జీవీ దగ్గర పని చేసిన విషయం ఆయనకే తెలియదట. చాలా ఆసక్తికరంగా ఉంది కదా. అలా రామ్ గోపాల్ వర్మ దగ్గర ఏకలవ్య శిష్యరికం చేసిన వ్యక్తి ఇప్పుడు టాలీవుడ్ లో ఫేమస్ దర్శకుడయ్యాడు. ఇప్పుడితని పేరు టాలీవుడ్ లో తెగ మార్మోగుతుంది. గతంలో నాగ చైతన్య, నాని వంటి హిట్ సినిమాలు తీశాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్. ఇప్పుడు రవితేజతో మరో బ్లాక్ బస్టర్ తెరకెక్కించాడు. ఈపాటికే అర్థమై ఉంటుంది.. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. ఆయన మరెవరో కాదు శివ నిర్వాణ

గతంలో నిన్నుకోరి, మజిలీ వంటి ఫీల్ గుడ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శివ నిర్వాణ. అయితే ఆ తర్వాత శివ తీసిన టక్ జగదీష్, ఖుషి సినిమాలు పెద్దగా ఆడలేదు. అయితే ఎట్టకేలకు ఇరుముడి సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్. ఈ నేపథ్యంలో శివ నిర్వాణ గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శివ నిర్వాణ ఎమ్మెస్సీ, బీఈడీ పూర్తి చేశాడు. లెక్చరర్ గా కూడా పని చేసాడు. అయితే సినిమాలపై ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఇదే క్రమంలో రక్త చరిత్ర సినిమా షూటింగ్ లో తనకు బాగా ఇష్టమైన ఆర్జీవీకి దగ్గరగా ఉండి ఆయన సినిమా మేకింగ్ ను గమనించాలని అనుకున్నారట శివ. అయితే ప్రొడక్షన్ మేనేజర్ వద్దు అని చెప్పడం, సరిగ్గా అదే సమయంలో రామ్ గోపాల్ వర్మ కు కూలర్ పెట్టే బాయ్ డబ్బుల కోసం ఆ మేనేజర్ తో గొడవపడటం ఒకేసారి జరిగాయట. దాంతో ఆ కూలర్ బాయ్ కు తానే డబ్బులు ఇస్తాను అని చెప్పి ఆ కూలర్ పట్టుకునే పనికి చేరాడట శివ నిర్వాణ. అయితే కనీసం కూలర్ ఎలా పట్టాలి? అందులో నీళ్లు ఎలా పోయాలి? అని తెలియని శివ సినిమా పిచ్చితో అన్ని పనులు నేర్చుకున్నాడట. ఇదే క్రమంలో సినీ ప్రముఖులతో పరిచయాలు పెంచుకుని డైరెక్టర్ గా ఛాన్స్ తెచ్చుకున్నాడట. ఇక ఆ తర్వాత సంగతి అందరికీ తెలిసిందే.

ఇవి కూడా చదవండి

రవితేజతో డైరెక్టర్ శివ నిర్వాణ..

ఇరుముడి మల్లెపూల పల్లకి సాంగ్..

ఇరుముడి సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us