విజయ్, త్రిష పెళ్లి చేసుకోబోతున్నారా.? హింట్ ఇచ్చేశారంటున్న నెటిజన్స్.. అసలు ఏమైందంటే

దళపతి విజయ్ పేరు ఇప్పుడు కోలీవుడ్ లోనే కాదు దేశ వ్యాప్తంగా మారుమ్రోగుతుంది.. సినిమాల్లో స్టార్ గా రాణించిన దళపతి విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నారు. కొత్త పార్టీ పెట్టి మూడు నాలుగు భారీ సభలను కూడా పెట్టారు.

విజయ్, త్రిష పెళ్లి చేసుకోబోతున్నారా.? హింట్ ఇచ్చేశారంటున్న నెటిజన్స్.. అసలు ఏమైందంటే
Vijay , Trisha

Updated on: Mar 17, 2026 | 8:30 PM

తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ పేరు ఇప్పుడు కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ తెగ వినిపిస్తుంది. ఎక్కడ చూసిన విజయ్, త్రిష గురించే మాట్లాడుకుంటున్నారు. ఇటీవలే హీరో విజయ్ భార్య విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. హీరోయిన్ తో విజయ్ కు ఎఫైర్ ఉంది అంటూ ఆమె విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. దాంతో తెరపైకి త్రిష పేరు వచ్చింది. విజయ్ కు త్రిషకు మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. ఓ నటితో విజయ్ కు ఎఫైర్ ఉందని ఆరోపిస్తూ ఆధారాలు కూడా చూపిస్తూ విజయ్ భార్య విడాకులకు కోర్టును ఆశ్రయించింది. దాంతో కోలీవుడ్ లో ఒక్కసారిగా దుమారం రేగింది. విజయ్ తో ఎఫైర్ పెట్టుకున్న నటి ఎవరు అంటూ కోలీవుడ్ లో చర్చ మొదలైంది.

Pawan Kalyan: రాజకీయాల్లోకి రావచ్చుగా.. హీరోయిన్‌కు పవన్ కళ్యాణ్ ఆఫర్.. కానీ ఆమె ఏం చెప్పిందంటే

ఇటీవలే ఓ పెళ్లికి విజయ్, త్రిష కలిసి వెళ్లడం పెద్ద దుమారం రేపింది. విజయ్ త్రిష కలిసి ఐదు సినిమాల్లో నటించారు. ఈ ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. దాంతో త్రిష పేరు కాస్త గట్టిగానే వినిపించింది. ఇటీవలే ఓ రాజకీయ నేత కూడా విజయ్, త్రిష గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉంటే త్రిష విజయ్ గురించి కోలీవుడ్ లో చక్కర్లు కొట్టడంతో విజయ్ ఫాన్స్ కొందరు విజయ్ త్రిష ఫోటోలను ఎడిట్ చేస్తున్నారు. కాగా ఓ ఫ్యాన్ ఏఐ తో విజయ్ త్రిష పెళ్లి జరిగినట్టు ఆ పెళ్ళికి కోలీవుడ్ సెలబ్రెటీలు వచ్చినట్టు ఓ వీడియోను క్రియేట్ చేసి సోమహల్ మీడియాలో షేర్ చేశాడు.

వెంకటేష్ నా ప్రాణం కాపాడారు.. ఆ రోజు ఆయన లేకపోయి ఉంటే వామ్మో..!!

ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అయితే ఆ వీడియోకు త్రిష తల్లి లైక్ కొట్టడం ఇప్పుడు చర్చమశనీయంగా మారింది. దాంతో విజయ్ త్రిష త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ పెద్దెత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. విజయ్‌తో పెళ్లికి త్రిష తల్లి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందంటూ..ఆమె లైక్‌ కొట్టిన పోస్ట్‌ని వైరల్‌ చేస్తున్నారు నెటిజన్స్. త్వరలోనే విజయ్, త్రిష వ్యవహారం పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

Roja Selvamani: స్టార్ హీరో ఇంటికి కోడలిగా రోజా కూతురు..? ఇదిగో క్లారిటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us