చిత్ర ప‌రిశ్ర‌మ‌పై క‌రోనా కాటు..

మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ యావ‌త్ ప్ర‌పంచాన్ని చిన్నాభిన్నం చేసింది. దీని దెబ్బ‌కు అన్ని రంగాలు కుదేల‌య్యాయి. ప్ర‌భుత్వాలు స‌డ‌లింపులు ఇచ్చిన‌ప్ప‌టికీ వ్యాధికి సమ‌ర్థ‌వంతమైన‌ మెడిసిక్ కానీ, వ్యాక్సిన్ కానీ రాక‌పోవ‌డంతో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

  • Ram Naramaneni
  • Publish Date - 11:32 am, Wed, 15 July 20
చిత్ర ప‌రిశ్ర‌మ‌పై క‌రోనా కాటు..

మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ యావ‌త్ ప్ర‌పంచాన్ని చిన్నాభిన్నం చేసింది. దీని దెబ్బ‌కు అన్ని రంగాలు కుదేల‌య్యాయి. ప్ర‌భుత్వాలు స‌డ‌లింపులు ఇచ్చిన‌ప్ప‌టికీ వ్యాధికి సమ‌ర్థ‌వంతమైన‌ మెడిసిక్ కానీ, వ్యాక్సిన్ కానీ రాక‌పోవ‌డంతో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కాగా క‌రోనా వైర‌స్ సినిమా రంగాన్ని తీవ్రంగా కుదిపేసింది. వినోదానికి సంబంధించిన రంగం కావడంతో ప్ర‌భుత్వాలు స‌డ‌లింపుల విష‌యంలో కూడా అంత ప్రాధాన్యం ఇవ్వ‌లేదు. ఎప్పుడో చివ‌రికి షూటింగుల‌కు స‌డ‌లింపులు ద‌క్కాయి. థియేట‌ర్లు ఎప్ప‌డు ఓపెన్ అవుతాయో తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ప్ర‌జంట్ షూటింగులు కూడా జ‌రిగే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. చిత్రీక‌ర‌ణ‌కు మ్యాన్ ప‌వ‌ర్ అవ‌స‌రం. త‌క్కువ మందితో పనిచేసే సీరియల్స్ విష‌యంలోనే ముంద‌డుగు వేస్తే..ఏం జ‌రిగిందే అంద‌రికీ తెలిసిందే. టీవీ ఆర్టిస్టులు ఒక‌రి వెంట ఒక‌రు క‌రోనా బారిన ప‌డ్డారు.

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు సంబంధించి జూన్‌లోనే ప‌ర్మిష‌న్ ఇచ్చింది తెలంగాణ ప్ర‌భుత్వం. జులై 15 నుంచి షూటింగులు చేసుకోవ‌చ్చ‌ని ఏపీ స‌ర్కార్ తెలిపింది. అయినప్ప‌టికీ హీరోలు, న‌టీన‌టులు సెట్స్ లో అడుగుపెట్టడానికి జంకుతున్నారు. మేక‌ర్స్ కూడా లేనిపోని త‌ల‌నొప్పులు ఎందుకని ముంద‌డుగు వేయ‌డం లేదు. ఆగ‌స్టు నుంచి షూటింగులు మొద‌లుపెట్టాల‌ని కొంద‌రు నిర్మాత‌లు అనుకున్న‌ప్ప‌టికీ..బిగ్‌బీ ఫ్యామిలీకి క‌రోనా సోక‌డంతో పున‌రాలోచ‌న‌లో ప‌డ్డాయి యూనిట్లు. క‌రోనాకు వ్యాక్సిన్ వ‌స్తేనో… వ్యాధి వ్యాప్తి త‌గ్గితేనో త‌ప్ప‌ షూటింగులు నిర్వ‌హించే ప‌రిస్థితి లేద‌ని కొంద‌రు నిర్మాత‌లు తెగేసి చెప్తున్నారు. ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న సినిమాల‌కు ఇత‌ర రాష్ట్రాల ఆర్టిస్టుల అవ‌స‌రం ఉండ‌టంతో ఇక్క‌ట్లు త‌ప్ప‌ట్లేదు. ఇప్ప‌టికే ముంద‌డుగేసి రామ్‌గోపాల్ వ‌ర్మ‌, ర‌విబాబులాంటి ద‌ర్శ‌కులు షూటింగులు చేస్తున్నారు. మెగాస్టార్ అల్లుడు క‌ల్యాణ్‌దేవ్ `సూప‌ర్ మ‌చ్చి` షూటింగ్ కంప్లీట్ చేశాడు. మ‌రోవైపు ఓటీటీలు వ‌చ్చి డిస్టిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్ల క‌డుపు కొడుతున్నాయి. ఏది ఏమైనా టాలీవుడ్ ఎప్పుడూ ఊహించ‌న‌టువంటి సంక్షోభాన్ని ఎదుర్కుంటుంది.