Wayanad Landslide: వయనాడ్ బాధితులకు అండగా మెగా ఫ్యామిలీ.. భారీ ఆర్థిక సాయం ప్రకటించిన చిరంజీవి, చెర్రీ, బన్నీ

|

Aug 04, 2024 | 3:11 PM

ఆపదలో ఉన్న వారిని చేయందించి ఆదుకోవడంలో మెగా ఫ్యామిలీ ఒక్క అడుగు ముందే ఉంటుంది. తాజాగా కేరళలోని వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు చిరంజీవి, రామ్ చరణ్ ముందుకొచ్చారు. భారీ వర్షాలు, వరదల కారణంగా వయనాడ్ లో కొండ చరియలు విరిగి పడి సుమారు 300 మందికి పైగా మృత్యువాత పడ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

Wayanad Landslide: వయనాడ్ బాధితులకు అండగా మెగా ఫ్యామిలీ.. భారీ ఆర్థిక సాయం ప్రకటించిన చిరంజీవి, చెర్రీ, బన్నీ
Chiranjeevi Family
Follow us on

ఆపదలో ఉన్న వారిని చేయందించి ఆదుకోవడంలో మెగా ఫ్యామిలీ ఒక్క అడుగు ముందే ఉంటుంది. తాజాగా కేరళలోని వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు చిరంజీవి, రామ్ చరణ్ ముందుకొచ్చారు. భారీ వర్షాలు, వరదల కారణంగా వయనాడ్ లో కొండ చరియలు విరిగి పడి సుమారు 300 మందికి పైగా మృత్యువాత పడ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీస్తున్నారు. కాగా ఈ విషాద ఘటనపై యావత్ దేశం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్.. ఇలా అన్ని రంగాలకు చెందిన సినిమా సెలబ్రిటీలు తమ వంతు విరాళాలు అందజేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా త‌న వంతు సాయంగా కోటి రూపాయలను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా అందించారు. రామ్ చ‌ర‌ణ్ తానే క‌లిసి ఈ విరాళం ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు చిరంజీవి. ‘గత కొన్ని రోజులుగా ప్రకృతి ప్రకోపానికి కేరళలో జరిగిన విధ్వంసంచ వందలాది విలువైన ప్రాణాలను కోల్పోయినందుకు తీవ్ర మనోవేదనకు గురయ్యాను. వయనాడ్ దుర్ఘటన బాధితులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు చరణ్‌, నేను కలిసి రూ.1 కోటి విరాళంగా అందజేస్తున్నాం. బాధలో ఉన్న వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.

 

ఇవి కూడా చదవండి

అంత‌కుముందు మరో మెగాహీరో అల్లు అర్జున్ కూడా కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షల విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు. కేరళ వాసులు తనని ఎంతో అభిమానించారని అల్లు అర్జున్‌ చెప్పారు. వయనాడ్‌ ఘటన తనని కలచి వేసిందన్నారు. కాగా అల్లు అర్జున్‌కు తెలుగులో పాటు మ‌ల‌యాళంలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విష‌యం తెలిసిందే. అక్కడి అభిమానులు అల్లు అర్జున్‌ని ముద్దుగా మ‌ల్లు అర్జున్ అని పిలుచుకుంటారు.

చిరంజీవి ట్వీట్..

అల్లు అర్జున్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.