
కొన్ని సినిమాలు భలే చిత్రంగా విజయం సాధిస్తాయి. దర్శక నిర్మాతలు ఎంత బడ్జెట్ పెట్టి స్టార్ హీరోలను పెట్టి సినిమా చేసిన చివరికి ఆ సినిమా రిజెల్ట్ అనేది ఆడియన్స్ చేతిలోనే ఉంటుంది. సినిమా విడుదలన మొదటి రోజే ఆ సినిమా హిట్ అయ్యిందా.. ఫ్లాప్ అయ్యిందా అన్న విషయం అర్ధమైపోతుంది. ఇప్పుడొస్తున్న సినిమాలు కలెక్షన్స్ బట్టి హిట్టా ఫట్టా అనేది డిసైడ్ చేస్తున్నారు. ఇక చిన్న సినిమాలు కూడా పెద్ద పెద్ద విజయాలను సాధిస్తున్నాయి. తాజాగా ఓ చిన్న సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సినిమా కేవలం లక్ష రూపాయిలతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ఏకంగా రూ. 20 కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది.ఇంటర్నెట్‌లో ఒక రాత్రికి రాత్రే వైరల్ అయి, సోషల్ మీడియా ట్రోలింగ్ వల్ల బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించి సంచలనం సృష్టించింది ఈ సినిమా..
1990ల కాలం నాటి గ్రాఫిక్స్, అతుకుల బొమ్మలు, పిల్లల బొమ్మలాంటి యానిమేషన్ తో ఈ సినిమా తెరకెక్కించారు. ఇప్పుడున్న టెక్నాలజీకి ఏ మాత్రం సంబంధం లేకుండా తెరకెక్కించిన ఈ సినిమా పై ఓ రేంజ్లో ట్రోల్స్, మీమ్స్ వచ్చాయి. ఈ సినిమాలోని చిత్రవిచిత్రమైన క్యారెక్టర్స్, వాటి మూవ్‌మెంట్స్ చూసి నెటిజన్లు దీనిని “చైనా హిస్టరీలోనే అత్యంత దారుణమైన, చెత్త యానిమేషన్” అని ఎగతాళి చేశారు.
చైనీస్ మూవీ రివ్యూ సైట్ ‘డౌబాన్’ (Douban) లో “ఇంత దారుణమైన సినిమా చూడడం జీవితంలో ఇదే తొలిసారి”, “కళ్ళు పోయేంత చెత్తగా ఉంది” అని కామెంట్లు పెట్టారు. సినిమా పేరు ‘న్యూ లయి’ అంటే చైనీస్ భాషలో “ఆవు లేదాఎద్దు వస్తోంది” అని అర్థం. సాధారణంగా పెద్ద పెద్ద యానిమేషన్ సినిమాలకు వందల కోట్లు, వేల మంది స్టాఫ్ ఉంటారు. కానీ ఈ ‘న్యూ లయి’ సినిమాను కేవలం ఒక కొడుకు , అతని తల్లి కలిసి ఐదేళ్ల పాటు దాదాపు రూ. 3లక్ష తక్కువ బడ్జెట్‌తో తయారుచేశారు. మొదట్లో ఈ సినిమాకు పెద్దగా కలెక్షన్ రాలేదు. మొదట్లో స్ కేవలం లక్ష రూపాయిలు మాత్రమే వచ్చాయి. అయితే ఆతర్వాత ట్రోలింగ్ , మీమ్స్ పుణ్యమా అని రాత్రికి రాత్రే 18 మిలియన్ యువాన్లకు పైగా ( అంటే దాదాపు రూ.21 కోట్లకు పైగా) కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది.
ఇది కూడా చదవండి :
A newly released animated film called “Niu Lai” (牛来) is going viral for all the wrong reasons in China.
People are calling the visuals “disaster-level” , the entire production team was basically just two people: the director and the screenwriter. After 9 days in theaters, the… pic.twitter.com/l7RM9ZER67
— Tong Bingxue 仝冰雪 (@tongbingxue) August 15, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.