Vijay Devarakonda: ముంబైలో స్టైలిష్‌గా ల్యాండ్ అయిన ‘లైగర్‘.. వైరల్‌గా విజయ్ దేవరకొండ ఫొటోలు..

Charmy Post Vijay Deverakonda Photo In Instagram: ‘అర్జున్ రెడ్డి‘తో ఒక్కసారిగా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా హిందీలోనూ విజయ్ తన...

Vijay Devarakonda: ముంబైలో స్టైలిష్‌గా ల్యాండ్ అయిన ‘లైగర్‘.. వైరల్‌గా విజయ్ దేవరకొండ ఫొటోలు..

Updated on: Feb 13, 2021 | 9:28 PM

Charmy Post Vijay Deverakonda Photo In Instagram: ‘అర్జున్ రెడ్డి‘తో ఒక్కసారిగా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా హిందీలోనూ విజయ్ తన పాపులారిటీని పెంచుకున్నాడు.
దీంతో ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునే క్రమంలోనే టాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ విజయ్‌ని బాలీవుడ్‌కి పరిచయం చేస్తూ ‘లైగర్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిట్ లాంచ్ రోజునే విజయ్ అభిమానులు ఎంత రచ్చ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. బహుశా సినిమా టైటిల్ విడుదల రోజే ఇంత హంగామా చేయడం ఇదే తొలిసారి కావొచ్చు. ఇటీవల విజయ్ షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి హైదరాబాద్ వచ్చాడు. అయితే తాజాగా తిరిగి షూటింగ్‌లో పాల్గొనేందుకు వెళ్లాడు. ఈ విషయాన్ని ‘లైగర్‘ నిర్మాతల్లో ఒకరైన నటి చార్మీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. స్పెషల్ ఫ్లైట్‌లో విజయ్ స్టైలిష్ లుక్‌లో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘లైగర్ స్టైల్‌గా ముంబై‌లో ల్యాండ్ అయ్యాడు. త్వరలోనే సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నాడు’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

Also Read: Uppena first day collection: మెగా మేనల్లుడి రికార్డ్.. తొలిరోజు ‘ఉప్పెన’లా వచ్చిన కలెక్షన్స్