టాలీవుడ్ లో ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా రాణిస్తున్నారు. వారిలో రోహిణి ఒకరు. నాని నటించిన అలా మొదలైంది సినిమాతో రోహిణి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వరుస సినిమాలతో అలరిస్తున్నారు. ముఖ్యంగా హీరోలకు, హీరోయిన్స్ కు అమ్మ పాత్రలో ఆమె మెప్పిస్తున్నారు. ఈమధ్య కాలంలో వచ్చిన సినిమాలన్నింటిలో రోహిణి నటించారు. డబ్బింగు ఆర్టిస్ట్ గా చాలా తెలుగు సినిమాలకు పని చేశారు రోహిణి. రోహిణి తెలుగులో ఒక్క విజయశాంతికి తప్ప అందరు హీరోయిన్స్ కు డబ్బింగ్ చెప్పారట. రోహిణి సినీ నటుడు రఘువరన్‌ను 1996 లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రఘువరన్ మరణం తర్వాత రోహిణి కుటుంబ భారాన్ని మోస్తూనే కొడుకును పెంచి పెద్ద చేశారు. రఘువరన్ విలన్ గా ఎన్నో సినిమాల్లో మెప్పించారు.
అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సుస్వాగతం సినిమాలో పవన్ తండ్రిగా అద్భుతంగా నటించి మెప్పించారు రఘువరన్. ఈ సినిమాలో దేవయాని హీరోయిన్ గా నటించారు. అయితే ఈ సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ గురించి రోహిణికి ఓ విషయం చెప్పారట రఘువరన్.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దాని గురించి ప్రస్తావించారు రోహిణి. సుస్వాగతం మొదటి రోజు షూటింగ్ అయిపోయిన తర్వాత రఘువరన్ ఇంటికి వచ్చి.. తనకు పవన్ కళ్యాణ్ కు మధ్య షూటింగ్ ఎలా జరిగిందని చెప్పారట. పవన్ కళ్యాణ్ లో ఏదో మ్యాజిక్.. తెలియని మిరాకిల్ ఉందని అన్నారట. ఆ తర్వాత ఈ ఇద్దరు కలిసి జానీ సినిమాలో నటించారు కూడా.. అప్పుడు కూడా రఘువరన్ పవన్ గురించి చెప్పేవారట..
అలా వస్తాడు..ఇలా చేస్తాడు..వెళ్ళిపోతాడు. ఇందుకు ఇలా చేస్తావ్ అని అడిగితే. మీకు అంతా తెలుసు అంటాడు. అతను ఒక క్రేజీ బాయ్ అని చెప్పవారట రఘువరన్. అప్పుడు రఘువరన్ , పవన్ గురించి చెప్తుంటే నమ్మలేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని దగ్గర నుంచి చూస్తుంటే రఘువరన్ చెప్పినా ఆనాటి విషయాలు గుర్తుకు వస్తున్నాయి అని అన్నారు రోహిణి.